అనాథనని మాయమాటలు చెప్పి ముగ్గుర్ని పెళ్లి చేసుకున్న కిలాడి లేడీ.. చివరికి ఏం జరిగిందంటే..?
మణుగూరు : అనాథని అని చెబుతూ యువకులను పెళ్లి చేసుకుని వారి వద్ద ఉన్న డబ్బును దన్నుకుని మాయమవుతున్న మహిళను తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం … ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన ముప్పాల సుహాసిని ముందుగానే తన మేనమామతో వివాహం జరిగింది. కొంతకాలం బానే ఉంది . తర్వాత డబ్బుకు ఆశపడి భద్రాద్రి కొత్తగూడెం, జిల్లా మణుగూరు పికె -1 సెంటర్‌కు చెందిన వినయ్ దేవరకొండకు తాను అనాథనంటూ పరిచయం చేసుకుంది. కొంత కాలం వారి స్నేహం చేశారు. 2019 మేలో 23 న వినయ్ సుహాసిని పెళ్లి చేసుకున్నాడు. కొంత కాలం మంచిగానే ఉన్న ఆమె రూ.1.5లక్షల నగదు, మూడున్నర తులాల బంగారు ఆభరణాలు తీసుకొని పారిపోయింది. తాను మోసపోయినట్లు గుర్తించిన వినయ్ గతనెల 16న మణుగూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మణుగూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఈ క్రమంలోనే తిరుపతికి ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న సునీల్ కుమార్‌తో సుహాసిని పరిచయం ఏర్పచ్చుకుంది. సునీల్ కుమార్ తన తల్లిదండ్రులను ఒప్పించి మరీ సుహాసిని పెళ్లి చేసుకున్నాడు. ఆ సమయంలో సునీల్ తల్లిదండ్రులు 10 తులాల బంగారం పెట్టారు.
వివాహమైన కొద్దిరోజులకు తన చిన్నప్పటి నుంచి తనను ఆదరించిన వారి ఆరోగ్య బాగోలేదని భర్తకు చెప్పి అత్తమామల నుంచి రూ.6 లక్షలు నగదు తీసుకుంది. కొన్నాళ్లకు భర్త సునీల్ ఆమెను నిలదీయడంతో మరుసటి రోజే ఇంటి నుంచి పారిపోయింది. సునీల్ కుమార్ అలిపిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సునీల్ ఫిర్యాదుతో అలిపిరిలో ఆమెను అరెస్టు చేశారు. మణుగూరులో కూడా సుహాసినిపై కేసు ఉండడంతో ఇక్కడకు తీసుకొచ్చారు. సుహాసిని వీళ్లిద్దరినే కాకుండా పలువురిని ఇదే క్రమంలో మోసం చేసినట్లు మణుగూరు ఏఎస్పీ ఎం.శబరీష్ వెల్లడించారు.