Khammam..రైతును రాజు చేసిన రాష్ట్రం మనదే: మంత్రి పువ్వాడ
దేశానికి అన్నం పెట్టే రైతును రాజు చేసిన రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పలు కార్యక్రమాలు ప్రవేశపెట్టారని, అన్నదాత సంక్షేమం కోసం టీఆర్ఎస్ సర్కారు పని చేస్తున్నదని మంత్రి అజయ్ తెలిపారు. సోమవారం జిల్లాలోని ఎర్రుపాలెం మండల కేంద్రంలోని రైతు వేదిక భవాన్ని మంత్రి అజయ్ ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ సర్కారు ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్నదని చెప్పారు. రైతు వేదికను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, కలిసి కట్టుగా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రైతాంగ శ్రేయస్సు కోసమే రైతు బీమా, రైతు బంధు వంటి పథకాలు తీసుకొచ్చారని మంత్రి అజయ్ వివరించారు. వ్యవసాయంలో నూతన విధానాల ఎంపికపై అధికారులతో చర్చించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గౌతమ్, జెడ్పీ చైర్మన్ కమాల్ రాజు, స్థానిక టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.