krishna : త‌క్ష‌ణ‌మే ఉపాధి హామీ ప‌నుల బిల్లులు చెల్లించాలి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

krishna : త‌క్ష‌ణ‌మే ఉపాధి హామీ ప‌నుల బిల్లులు చెల్లించాలి

 Authored By saidulu | The Telugu News | Updated on :3 August 2021,11:23 am

krishna  : మ‌చిలీప‌ట్నం : ఉపాధి హామీ బిల్లులు చెల్లించాల‌ని గూడూరు ఎంపీడీవో కార్యాలయం ఎదుట మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు ఆధ్వర్యంలో ఉపాధి కూలీలు నిరసన తెలిపారు. వెంట‌నే ఉపాధి ప‌నుల బ‌కాయిలు చెల్లించాలని ఆంధ్ర‌ప్ర‌ధేశ్ హైకోర్టు ప్ర‌భుత్వాన్ని ఆదేశించినా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవక పోవ‌డంతో కొన‌క‌ళ్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా కోర్టు తీర్పున‌కు అనుగుణంగా ఉపాధి హామీ ప‌నుల బిల్లులు చెల్లించాల‌ని కోన‌క‌ళ్ల నారాయ‌ణ‌రావు, కొల్లు ర‌వీంద్ర గూడూరు ఎంపిడిఒ జి. వి. సూర్య‌నారాయ‌ణ‌కు విన‌తి ప‌త్రం అందించారు.

bills for employment guarantee works must be paid immediately

bills-for-employment-guarantee-works-must-be-paid-immediately

అధికారులకు రాజ‌కీయ నాయకుల ఒత్తిడి స‌హ‌జ‌మ‌ని వాట‌న్నిటిని పట్టించుకోకుండా వారి విధిని నిర్వ‌హించాల‌ని, కోర్టు తీర్పు మేర‌కు పెండింగ్ బిల్లులు వెంట‌నే చెల్లించాల‌ని కోరారు. టీడీపీ నాయకులు సత్యనారాయణ, నాని, బాబా ప్రసాద్‌, నీరజ, సుశీల, పరబ్రహ్మం, కార్పొరేటర్లు సమతా కీర్తి, రామకృష్ణ, సాంబయ్య త్రివిక్రమరావు, సుధాకర్‌,చిట్టూరి యువరాజ్‌, పి.వి.ఫణికుమార్‌, గోకుల్‌ శివ, ప్రసాద్‌, రామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అవ‌నిగ‌డ్డ‌లో..

వైసిపి అధికారం చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి ఉపాధి హామీ బిల్లులు చెల్లించ‌డం లేద‌ని టిడిపి నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కేంద్రం ఉపాధి హామీ బిల్లులు చెల్లించినా ప్ర‌భుత్వం వాటిని దారి మ‌ళ్లిస్తుంద‌ని బిల్లులు చెల్లించ‌క పోవ‌టంతో ప‌నులు చేయించిన మాజీ స‌ర్పంచ్‌లు, కాట్రాక్ట‌ర్లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని మ‌చిలీప‌ట్నం పార్ల‌మెంట్ స‌భ్యులు టిడిపి ప్ర‌తినిధి కొల్లూరి వెంక‌టేశ్వ‌ర‌రావు, గాజుల ముర‌లీకృష్ణ‌, తుంగ‌ల శ్రీ‌నివాసరావు, బండె రాఘ‌వ త‌దిత‌రులు సోమ‌వారం అవ‌నిగ‌డ్డ ఎంపిడిఒ కార్యాల‌యం ఎదుట నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

saidulu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది