SV Krishna reddy : అలీ పక్కన హీరోయిన్‌గా చేయను అనేసింది.. సౌందర్యపై ఎస్వీ కృష్ణారెడ్డి కామెంట్స్

Advertisement

SV Krishna reddy : దర్శకుడు, హీరో, సంగీత దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మక్కువే. ఆయన సినిమాల్లోని పాత్రలు, సంగీతం, హాస్యం, ప్రేమ, ఎమోషన్ ఇలా ప్రతీ ఒక్కటి కూడా అందరినీ ఆకట్టుకుంటాయి. ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్టే. హీరోగానూ సూపర్ హిట్ చిత్రాలను తీశాడు. అలా ఎంతో మందికి లైఫ్‌ను ఇచ్చాడు కృష్ణారెడ్డి. ముఖ్యంగా అలీ జీవితాన్ని యూటర్న్ తిప్పేసిన వాడు ఎస్వీ కృష్ణారెడ్డి. యమలీల సినిమాతో అలీ కెరీర్‌ను అమాంతం ఎవరెస్ట్ మీద ఉంచాడు.

Advertisement
SV Krishna reddy about Soundarya Rejecting Yamaleela Movie Offer
SV Krishna reddy about Soundarya Rejecting Yamaleela Movie Offer

అయితే ముందుగా యమలీల చిత్రాన్ని మహేష్ బాబుతో చేయాలని అనుకున్నాడు. కానీ వయసు మరీ తక్కువగా ఉందని సూపర్ స్టార్ కృష్ణ అన్నాడట. ఆ తరువాత ఆ కథను అలీకి మాత్రమే సూట్ అవుతుందని, అతనే నా హీరో అంటూ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఎస్వీ కృష్ణారెడ్డి. తాజాగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ నాడు జరిగిన ఓ ఘటన గురించి చెప్పుకొచ్చాడు. యమలీల సినిమా కోసం సౌందర్యను హీరోయిన్‌గా తీసుకున్నామని, అడ్వాన్స్ కూడా ఇచ్చేశామని అసలు విషయం చెప్పుకొచ్చాడు.

Advertisement

ఆయన కోసం ఎవ్వరినైనా వదులుకుంటా : SV Krishna reddy,

అయితే ఒకనాడు సౌందర్య తన వద్దకు వచ్చి.. అలీ హీరోగా అంటే అతని పక్కన హీరోయిన్‌గా చేయలేను.. ఇప్పుడు పెద్ద హీరోల పక్కన చేస్తున్నాను.. మీరే కాస్త ఆలోచించండి.. మీరు హీరోగా చేస్తానంటూ.. నేను హీరోయిన్‌గా చేస్తాను అని సౌందర్య ఎస్వీ కృష్ణారెడ్డితో చెప్పుకొచ్చిందట. అలీ మాత్రమే ఆ పాత్రకు సెట్ అవుతాడు.. ఆయనే హీరో.. ఆయన కోసం ఎవ్వరినైనా వదులుకుంటాను గానీ ఆయన్ను మాత్రం వదలుకోలేను అని సౌందర్యకు చెప్పడంతో ఆమె షాక్ అయిందట.

అలీ రేపు ఒక వేళ పెద్ద హీరో అయితే.. అప్పుడు కూడా ఇదే మాట అంటావా? అని ఎస్వీ కృష్ణారెడ్డి సౌందర్యను అడిగాడట. ఒక వేళ ఆయన పెద్ద హీరో అయితే అప్పటి పరిస్థితులు.. అవకాశం వస్తే చేస్తాను అని చెప్పిందట. అలా శుభలగ్నం సినిమాలో అలీకి ఓ స్పెషల్ సాంగ్ ఉందని తెలుసుకుని సౌందర్యే ముందుకు వచ్చిందట. ఆ రోజు చాన్స్ మిస్ చేసుకున్నాను.. నాకు ఆ వెలితి ఉండిపోయింది.. అలీ పక్కనే ఆ ఒక్క పాట అయినా నేను చేస్తాను అని సౌందర్యే ముందుకు వచ్చిందట. ఈ విషయాలన్నీ చెబుతూ సౌందర్య, అలీ ఇద్దరూ గొప్పవారే అని ఎస్వీ కృష్ణారెడ్డి చెప్పుకొచ్చాడట.

Advertisement
Advertisement