ఎలక్ట్రిక్ వాహనదారులకు గుడ్ న్యూస్.. ఎమ్మెల్యే నోముల ప్రకటన
ప్రజెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ట్రెండ్ నడుస్తున్నది. చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలు వాడటం వైపు మొగ్గు చూపడాన్ని మనం గమనించొచ్చు. రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, శబ్ద కాలుష్యం నేపథ్యంలో ఇటీవల కాలంలో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలు వాడేందుకు ఇష్టపడుతున్నారు. పలు ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ సైతం ఎలక్ట్రిక్ వెహికల్స్ మేకింగ్‌పైన దృష్టి పెడుతున్నాయి. కాగా, ఎలక్ట్రిక్ వాహనదారులకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ గుడ్ న్యూస్ చెప్పారు.
పర్యవరణ పరిరక్షణే ధ్యేయంగా ఎలక్ట్రిక్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ పాలసీ కింద తెలంగాణలో ఎలక్ట్రిక్, బ్యాటరీ వెహికల్స్ ప్రోత్సహిస్తున్నట్లు ఎమ్మెల్యే భగత్ తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్ ట్యాక్స్‌ను మాఫీ చేసినట్లు వివరించారు. తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్ల జోరు ఇంకా పెరిగే చాన్సెస్ కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కూడా ఎలక్ట్రిక్ వాహనాలు జోరు బానే ఉన్నట్లు పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అయితే, చాలా మంది పెరుగతున్న డీజిల్, పెట్రోల్ ధరలను చూసే ఎకో ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు దృష్టి సారిస్తున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.