Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం, పెరిగిన వెండి ధరలు.. ఎంతో తెలుసా?
Today Gold Rates : ఈరోజుల్లో బంగారం కొనాలంటే ఆస్తులన్నీ అమ్ముకోవాల్సిందే. ఒకప్పుడు బంగారం కొనడానికి పెద్దగా ఎవ్వరూ ఆలోచించేవారు కాదు కానీ.. నేడు ఒక తులం బంగారం కొనాలంటే రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సిందే. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు అయితే లక్షలకు లక్షలు ఖర్చు పెట్టాల్సిందే. పేద, మధ్యతరగతి ప్రజలు అయితే బంగారం వైపు చూడటానికి కూడా భయపడుతున్నారు. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు, ద్రవ్యోల్బణం కారణంగా బంగారం ధరలు రోజు రోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగినట్టుగా బంగారం ధరలు పెరుగుతూ పోతున్నాయి తప్పితే తగ్గడం లేదు. మధ్యలో కొన్ని రోజులు తగ్గినా కూడా ఏదో తక్కువగా తగ్గి ఎక్కువగా ధరలు పెరుగుతున్నాయి. మొన్న బంగారం ధరలు స్థిరంగా ఉండగా.. వెండి ధరలు పెరిగాయి. నిన్న కూడా బంగారం ధరలు స్థిరంగా ఉండగా.. వెండి ధరలు తగ్గాయి. ఇవాళ మాత్రం బంగారం ధరలు స్థిరంగా ఉండగా.. వెండి ధరలు పెరిగాయి.

13 september 2022 today gold rates in telugu states
ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు రూ.4675 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.46,750 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ధరల్లో ఎలాంటి మార్పు లేదు. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.5100 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ధరల్లో మార్పు లేదు. 10 గ్రాముల బంగారం ధర రూ.51,000 గా ఉంది.
Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,450 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,760 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,150 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,050 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే హైదరాబాద్ లో చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000 గా ఉంది.
ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర రూ.55.20 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 20 పైసలు పెరిగింది. 10 గ్రాముల వెండి ధర రూ.552 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.552 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.2 పెరిగింది. కిలో వెండి ధర రూ.55,200 కాగా, నిన్నటి ధరతో పోల్చితే రూ.200 పెరిగింది.
చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.614 కాగా, కిలో వెండి ధర రూ.61400 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.552 కాగా, కిలో వెండి ధర రూ.55200 గా ఉంది.