Cyber Crime : తస్మాత్ జాగ్రత్త.. 48కే కోడిగుడ్లు అనే మెయిల్ వచ్చిందా..? మీ అకౌంట్లో డ‌బ్బులు గోవిందా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Cyber Crime : తస్మాత్ జాగ్రత్త.. 48కే కోడిగుడ్లు అనే మెయిల్ వచ్చిందా..? మీ అకౌంట్లో డ‌బ్బులు గోవిందా..!

Cyber Crime : రోజు రోజుకు సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. దేశం నలుమూల్లా నిత్యం సైబర్ మోసాలు జరుగుతున్నాయి. ప్రపంచం మొత్తం అందరకి అన్ని అరచేతిలోకి వస్తున్నాయి. దాదాపు ప్రపంచం మొత్తం ఆన్ లైన్ పేమెంట్స్ జరగడం మనం చూస్తున్నాం. అయితే ఆన్లైన్ పేమెంట్స్ వలన కొన్ని మోసాలు జరుగుతున్నాయని కూడా అందరికీ తెలుసు. అయితే కొన్ని వస్తువులను కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండకపోతే అది సైబర్ నేరగాళ్లకు అదునుగా మారి మోసాలకు దారి తీయడానికి […]

 Authored By aruna | The Telugu News | Updated on :26 February 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Cyber Crime : తస్మాత్ జాగ్రత్త.. 48కే కోడిగుడ్లు అనే మెయిల్ వచ్చిందా..? మీ అకౌంట్లో డ‌బ్బులు గోవిందా..!

Cyber Crime : రోజు రోజుకు సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. దేశం నలుమూల్లా నిత్యం సైబర్ మోసాలు జరుగుతున్నాయి. ప్రపంచం మొత్తం అందరకి అన్ని అరచేతిలోకి వస్తున్నాయి. దాదాపు ప్రపంచం మొత్తం ఆన్ లైన్ పేమెంట్స్ జరగడం మనం చూస్తున్నాం. అయితే ఆన్లైన్ పేమెంట్స్ వలన కొన్ని మోసాలు జరుగుతున్నాయని కూడా అందరికీ తెలుసు. అయితే కొన్ని వస్తువులను కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండకపోతే అది సైబర్ నేరగాళ్లకు అదునుగా మారి మోసాలకు దారి తీయడానికి సులభతరంగా ఉంటుంది. ఇప్పటివరకు సైబర్ నేరాలకు సంబంధించి ఎన్నో కేసులు మనం చూస్తూనే ఉన్నాము. ఎప్పటికప్పుడు పోలీసులు కూడా ప్రజలకు సైబర్ మోసాలపై అవగాహన కల్పిస్తూనే వస్తున్నారు. అయినా కూడా ఇంకా కొన్నిచోట్ల ఈ మోసాలు కు చాలా మంది మోసపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బెంగళూరులో ఓ మహిళకు 49 కె కోడిగుడ్లు ఇస్తామంటూ ఆమె మొబైల్ కి ఓ మెయిల్ రావడం జరిగింది. అయితే దానిని ఆమె ఓపెన్ చేయడంతో అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం మాయమయ్యాయి.

దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం… బెంగళూరులో వసంత నగర్ కు చెందిన ఓ మహిళ ఫిబ్రవరి నెలలో 17 ఆమె ఫోన్ కి ఒక మెయిల్ వచ్చింది. అది కోళ్ల ఫారం గురించి కోడిగుడ్లు డెలివరీ గురించి కోళ్ల పెంపకం గురించి ఓ స్టోరీ వచ్చింది. ఆమె దానిని చదువుతూ దాని తర్వాత 48 కి నాలుగు డజన్ల గుడ్లు కొనుగోలు చేసుకోవచ్చని అందులో రాసి ఉంది. అంత తక్కువ ధరకు అన్ని కోడిగుడ్లు వస్తున్నాయని ఆశతో ఆ మహిళ వెంటనే ఆ కోడిగుడ్లను కొనేయాలి అని దానికోసం అదే మెయిల్లో ఉన్న షాపింగ్ లో లింకును ఓపెన్ చేసింది. అక్కడ పేమెంట్ ప్రాసెస్ అంతా ఉంది. దానిలో ఆ మహిళ బ్యాంకు వివరాలు ఫోన్ నెంబరు ఇంకా ఎన్నో వివరాలను అన్ని ఫీల్ చేసింది. తర్వాత 49 రూపాయలు పే చేసింది. కానీ అక్కడ పేమెంట్ జరగలేదు.. ఇక ఆమె డబ్బులు పేమెంట్ చేయడానికి క్రెడిట్ కార్డును వినియోగించాల్సి వచ్చింది. వెంటనే క్రెడిట్ తో ఆ 49 ను పేమెంట్ చేసింది.

కానీ మరి కొద్ది క్షణాల్లో ఆమె ఖాతాలో నుంచి ఆమె చెల్లించిన దాని కంటే పది రెట్ల మనీ అంటే 48 ,199 మొత్తం ఖాళీ అయిపోయింది.. అప్పుడు ఆమె బ్యాంకు ఆకౌంటు మొత్తం ఖాళీ అవ్వగా అప్పుడు చూసి తను నేను సైబర్ నేరగాళ్ల చేతులో మోసపోయానని వెంటనే పోలీసులు దగ్గరికి వెళ్లి కంప్లైంట్ చేసింది. తర్వాత మహిళా క్రెడిట్ కార్డు ని కూడా బ్లాక్ చేయించింది.. ఇక ఆ మహిళలను పోలీసులు సైబర్ నేరగాళ్లపై అందరూ అవగాహన పెంచుకోవాలి అని ఆ మహిళకు గట్టిగా చెప్పారు. మొత్తానికి ఆన్లైన్ లో ఇలాంటి మోసాలు ఎక్కడో ఒక దగ్గర ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి సైబర్ నేరగాళ్లు విషయంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తపడవలసి ఉంటుంది.. లేదంటే ఇలాగే అందరూ మోసపోవాల్సి వస్తుంది..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది