7th Pay Commission : వచ్చే ఏడాది భారీగా పెరగనున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు.. ఫిట్ మెంట్ ఫ్యాక్టర్, డీఏ.. అన్నీ కలిపి ఎంత పెరగనుందో తెలుసా?
ప్రధానాంశాలు:
భారీగా పెరగనున్న డీఏ
4 నుంచి 5 శాతం వరకు పెరగనున్న డీఏ
ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా పెరగనున్న జీతాలు
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త సంవత్సరం ఇంకా రాకముందే గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే.. వచ్చే సంవత్సరం లోక్ సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఆఫర్ ప్రకటించింది. వచ్చే సంవత్సరం వారి జీతాలు భారీగా పెరకబోతున్నాయి. ఈ విషయం తెలిసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎగిరి గంతేస్తున్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో డీఏ పెంపు కూడా భారీగా ఉండబోతుందని తెలుస్తోంది. అలాగే.. ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ విషయంలోనూ కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే దసరా, దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం డీఏ పెంచింది. జులై 1 నుంచే పెంచిన డీఏ అమలులోకి వచ్చింది. ప్రస్తుతం డీఏ 46 శాతంగా ఉంది. అయితే.. వచ్చే సంవత్సరం జనవరిలో మళ్లీ డీఏ పెరిగే చాన్స్ ఉంది. ప్రస్తుతం డీఏ 46 శాతం ఉంది. వచ్చే సంవత్సరం ఎన్నికలు ఉన్న నేపథ్యంలో డీఏను 5 శాతం పెంచి మొత్తం 51 శాతం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ డీఏను 51 శాతం చేస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి.
ప్రస్తుతం ఉన్న ఏఐసీపీఐ ఇండెక్స్ ను పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుతం 137.5 పాయింట్లు ఉన్నాయి. ఏ స్కోర్ 48.54 శాతంగా ఉంది. ఇది జులై, ఆగస్టు, సెప్టెంబర్ లెక్కల ప్రకారం. అదే అక్టోబర్ ది తీసుకుంటే 49 శాతం దాటే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కానీ.. నవంబర్, డిసెంబర్ నెలకు సంబంధించిన గణాంకాలు ఇంకా రాలేదు. అప్పుడే డీఏ పెంపుపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకొని డీఏను పెంచుతారు. అలాగే.. ఏఐసీపీఐ పాయింట్లను లెక్కిస్తారు. ప్రస్తుతం ఉన్న పాయింట్ల ప్రకారం.. 48.50 వరకు డీఏ పెరగొచ్చు. అంటే ప్రస్తుతం ఉన్న 46 శాతం డీఏకు 2.5 ఎక్కువ అన్నమాట. కానీ.. అప్పటి వరకు చూస్తే మరో 2.5 శాతం పెరిగే చాన్స్ ఉందట. అందుకే.. వాటిని లెక్కిస్తే అది 51 శాతానికి చేరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
7th Pay Commission : డీఏ 51 శాతానికి పెరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎంత మేరకు పెరుగుతాయి?
ఒకవేళ డీఏ 51 శాతానికి పెరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగానే పెరుగుతాయి. అయితే.. 5 శాతం కాకుండా కేంద్రం 4 శాతం మాత్రమే డీఏ పెరిగే చాన్స్ ఉందని మరోవైపు వాదనలు వినిపిస్తున్నాయి. ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ పై కూడా కేంద్రం నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది. ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ ను పెంచితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగానే పెరగనున్నాయి.