Women Savings Scheme : మహిళలకు సేవింగ్స్ పథకం…లక్షల పెట్టుబడితో అధిక మొత్తంలో వడ్డీ…!
ప్రధానాంశాలు:
Women Savings Scheme : మహిళలకు సేవింగ్స్ పథకం...లక్షల పెట్టుబడితో అధిక మొత్తంలో వడ్డీ...!
Women Savings Scheme : ప్రస్తుత కాలంలో చాలామంది కష్టపడి సంపాదించిన డబ్బులు సురక్షితంగా ఉండేలా చూసుకుంటారు. అలాగే ఇతరులకు వడ్డీ ఇవ్వడం ద్వారా బ్యాంకులు లేదా పోస్ట్ ఆఫీస్ లలో పిక్స్ డిపాజిట్లు చేయడం ద్వారా కాలక్రమేనా దాని విలువ పెరుగుతుందని వివిధ రకాల మార్గాలను అన్వేషిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే చాలామంది బ్యాంకులలో లేదా పోస్ట్ ఆఫీసులో ఫిక్స్డ్ డిపాజిట్ల చేయడం ద్వారా లాభాల గడిస్తుంటారు. అయితే కష్టపడి సంపాదించిన డబ్బును సురక్షితంగా పెట్టుబడి పెట్టాలనే కోరిక ఉన్నవారికి పోస్ట్ ఆఫీస్ పిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ మంచి ఎంపిక అని చెప్పాలి.ఎందుకంటే ఈ స్కీమ్ ఎంచుకోవడం ద్వారా ఫిక్స్డ్ డిపాజిట్ ను కొనసాగించాలనుకుంటున్న వ్యవధిని నిర్ణయించేటప్పుడు వ్యక్తులు పెట్టే పెట్టుబడి పై సంబావ్య వడ్డీని అంచనా వేయవచ్చు.
Women Savings Scheme ఈ పథకం ప్రత్యేకతలు
అయితే ఈ పథకం నేషనల్ సేవింగ్ టైం డిపాజిట్ స్కీమ్ కింద పనిచేయడం జరుగుతుంది. మరి దీని ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు మనం పరిశీలిద్దాం..దీనిలో పెట్టుబడిదారులు వారి యొక్క డబ్బును 1 నుండి 5 సంవత్సరాల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఇక ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ కాబట్టి ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా పరిమితి కాలం ముగిసిన తర్వాత వడ్డీతోపాటు మొత్తం పెట్టుబడిని పొందవచ్చు. ఇక ఈ పథకం ద్వారా దాదాపు 6.9% నుండి 7.5% వరకు వడ్డీని మీరు పొందవచ్చు.అయితే 18 సంవత్సరాలు పైబడిన వ్యక్తులందరూ ఈ పథకంలో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. అలాగే తల్లిదండ్రులు 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు కలిగిన వారి పిల్లల తరపున కూడా పెట్టుబడి పెట్టవచ్చు…
అయితే ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన మొదటి 6 నెలలు ఉపసంహరణ పరిమితి చేయబడి కొనసాగింపును నిర్ధారిస్తారు. అంటే 1 వ్యక్తి రెండేళ్ల కాలానికి 2 లక్షలు పెట్టుబడి పెట్టినట్లయితే 7% శాతం వడ్డీ రేటును పరిగణలోకి తీసుకోవచ్చు. మెచ్యూరిటీ తర్వాత దాదాపు రూ.2,29,776 మొత్తాన్ని అందుకోవచ్చు. ఒకవేళ మీరు పెట్టిన పెట్టుబడిని మూడేళ్ల వరకు కొనసాగించాలి అనుకుంటే 7.1% వడ్డీ రేటు తో రూ.2,47,015 మొత్తాన్ని మీరు పొందగలుగుతారు.అయితే ఈ పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ పథకానికి వడ్డీ రేట్లు కూడా నిర్ణయించడం జరిగింది. ఈ పథకం ద్వారా ఏడాది పెట్టుబడి పెట్టినట్లయితే 6.9% రెండేళ్లకు 7% , మూడేళ్లకు 7.1% ,ఐదేళ్లకు 7.5% వడ్డీని పొందగలుగుతారు.