8 మందితో ప్రేమాయణం తర్వాత పెళ్లి చేసుకుని.. కిలాడి లేడీ చేష్టలకు పోలీసులు హడల్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

8 మందితో ప్రేమాయణం తర్వాత పెళ్లి చేసుకుని.. కిలాడి లేడీ చేష్టలకు పోలీసులు హడల్..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :13 July 2023,11:00 am

ప్రస్తుత రోజుల్లో చాలామంది యువత సోషల్ మీడియా మాయలో పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకునే పరిస్థితి నెలకొంది. ప్రేమ పేరుతో చాలామంది అసాంఘిక శక్తులాల ట్రాప్ లో పడి అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. మరి ముఖ్యంగా లేడీలు సోషల్ మీడియాలో కిలాడీలుగా మారిపోతున్నారు. రకరకాల సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అకౌంటులతో.. చాలామంది అబ్బాయిల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది దగ్గర డబ్బులు దోచుకుంటుండగా మరికొంతమంది దగ్గర.. ఆస్తులు కూడా దోచేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ కిలాడి లేడీల ఆగడాలకు అంతులేకుండా పోయింది.

తాజాగా తమిళనాడులో రషీద అనే యువతి.. ఈ రకంగానే ఏకంగా ఎనిమిది మందిని పెళ్లిళ్లు చేసుకుని.. బురిడీ కొట్టించింది. సేలం జిల్లా తరమంగళానికి చెందిన ఫైనాన్షియల్ మూర్తికి సోషల్ మీడియా యాప్ అయిన ఇన్స్టా ద్వారా పరిచయమైంది రషీదా. ఆమె బ్యూటీషియన్. వీరిద్దరూ స్నేహితులయ్యారు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని భావించి ఈ ఏడాది మార్చి 30.. ఓ దేవాలయంలో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అయితే ఆమె ఓ రోజు కనిపించకుండా పోయింది. ఈ క్రమంలో ఫైనాన్షియల్ మూర్తికి సంబంధించిన బంగారం మరియు డబ్బులు కూడా కనిపించకపోవడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. పెళ్లయిన మూడు నెలలు కలిసి ఉందని ఈనెల 5వ తేదీ నుంచి రషీద కనిపించకుండా పోయిందని తన ఇంట్లో ఒకటి. ఐదు లక్షల రూపాయల నగదు తో పాటు ఐదు సవర్ల బంగారం కూడా కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

kiladi lady married after rmance with 8 people

kiladi lady married after rmance with 8 people

దీంతో మూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి.. మొత్తం పరిచయం ఇంకా ఎలా పెళ్లి అన్ని విషయాలు తెలుసుకునే రషీద సోషల్ మీడియాలో ఉన్న ఫేక్ అకౌంట్స్ గుర్తించారు. ఒక్కో నకిలీ ఖాతాకు ఒక పేరు ఉందని అసభ్యకరమైన చాటింగ్లు చేస్తూ.. చాలామంది అబ్బాయిలను ట్రాప్ లో పడేసినట్లు తేలింది. మొత్తం ఈ రకంగా ఎనిమిది మందిని పెళ్లిళ్లు చేసుకున్నట్లు విచారణలో సంచలన విషయం బయటపడింది. దీంతో ఈ కిలాడీ లేడీ రషీదనీ పట్టుకోవడానికి కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో గాలిస్తున్నారు. ఈ రాష్ట్రాలలో కూడా ఈ బాధితులు ఉన్నట్లు విచారణలో బయటపడింది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది