Purandeswari : పురంధేశ్వరి కేంద్ర మంత్రి కానున్నారా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Purandeswari : పురంధేశ్వరి కేంద్ర మంత్రి కానున్నారా..?

Purandeswari : దగ్గుబాటి పురంధేశ్వరి.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుపరిచితమైన పేరు. తండ్రి విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు కుమార్తె గానే కాకుండా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందారు. తాజా లోక్ సభ ఎన్నికల్లో రాజమండ్రి నుంచి ఎంపీగా గెలిచిన పురంధేశ్వరి పైనే అందరి దృష్టి పడింది. ఆమె కేంద్ర మంత్రి కానున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రత్యర్థి వైఎస్సార్ సీపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ పై 2.39 లక్షల పైచిలుకు ఓట్లతో […]

 Authored By ramu | The Telugu News | Updated on :6 June 2024,12:31 pm

ప్రధానాంశాలు:

  •  Purandeswari : పురంధేశ్వరి కేంద్ర మంత్రి కానున్నారా..?

Purandeswari : దగ్గుబాటి పురంధేశ్వరి.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుపరిచితమైన పేరు. తండ్రి విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు కుమార్తె గానే కాకుండా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందారు. తాజా లోక్ సభ ఎన్నికల్లో రాజమండ్రి నుంచి ఎంపీగా గెలిచిన పురంధేశ్వరి పైనే అందరి దృష్టి పడింది. ఆమె కేంద్ర మంత్రి కానున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రత్యర్థి వైఎస్సార్ సీపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ పై 2.39 లక్షల పైచిలుకు ఓట్లతో గెలవడమే కాకుండా కూటమి విజయంలో ముఖ్య భూమిక పోషించారు.

ప్రస్తుతం బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న పురంధేశ్వరి.. ఎంపీ ఎన్నికల్లో గెలిస్తే కేంద్ర మంత్రి కానున్నారని ప్రచారంలో పాల్గొన్న బీజేపీ అగ్రనేతలు సైతం హింట్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా పురంధేశ్వరికి కేంద్ర మంత్రి పదవి దక్కుతుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. పురంధేశ్వరి తొలుత కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. రెండు సార్లు ఎంపీగా గెలుపొందడమే కాకుండా కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆమె తండ్రి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అయినప్పటికీ తదనంతర కాలంలో చంద్రబాబు నాయుడితో విభేదాలు నేపథ్యంలో ఆ పార్టీలో ఉండలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 2004లో బాపట్ల నుంచి పోటీ చేసి దగ్గుబాటి రామానాయుడిపై గెలుపొందారు. 2006 సంవత్సరంలో యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రిగా నియమితులయ్యారు.

Purandeswari పురంధేశ్వరి కేంద్ర మంత్రి కానున్నారా

Purandeswari : పురంధేశ్వరి కేంద్ర మంత్రి కానున్నారా..?

2009లో విశాఖపట్నం నుంచి పోటీ చేసి విజయం సాధించి మళ్లీ కేంద్ర సహాయ మంత్రిగా నియమితులయ్యారు. ఏపీ విభజనను నిరసిస్తూ 2014లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో విశాఖపట్నం నుంచి పోటీ చేసి మళ్లీ ఓటమి పాలయ్యారు. 4 జూలై 2023లో ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. తాజా ఎన్నికల్లో రాజమండ్రి నుంచి బరిలోకి దిగి గెలుపొందారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది