Crime News : చికెన్ ముక్క తక్కువైందని రెస్టారెంట్ ఓనర్ ను యువకులు ఏం చేశారో తెలుసా?
Crime News : చికెన్, మటన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ముఖ్యంగా పండుగలు, పబ్బాలకు చికెన్ నే మనం ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. ఏవైనా ఫంక్షన్లు అయినా కూడా చికెన్ ఉండాల్సిందే. పార్టీలలోనూ చికెన్ కు ఉండే ప్రాధాన్యత వేరు. అందుకే చికెన్, మటన్, ఫిష్ లాంటి వాటికి ఉండే ప్రాధాన్యతే వేరు. చాలామంది ఏవైనా పార్టీలలో చికెన్, మటన్ ఒక్క ముక్క తక్కువైనా చాలు.. గొడవకు దిగేస్తుంటారు. గొడవ పెట్టేసుకుంటారు. కొందరు కొట్టుకుంటారు కూడా. అలాంటి ఎన్నో సంఘటనలను మనం ఇప్పటి వరకు చూశాం. తాజాగా అటువంటి ఘటనే ఒకటి తాజాగా బెంగళూరులో చోటు చేసుకుంది. చికెన్ కబాబ్ కోసం రెస్టారెంట్ యజమానితోనే గొడవకు దిగారు యువకులు.
నగరంలోని కోణనకుంటకు చెందిన యువకులు.. రాత్రి పూట చికెన్ కబాబ్ ను ఆర్డర్ చేశారు. ఆర్డర్ ను రెస్టారెంట్ సిబ్బంది డెలివరీ చేసింది. అయితే.. చికెన్ కబాబ్ ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉందట. ముక్కలు చాలా తక్కువగా వేశారని యువకులకు అర్థం అయింది. దీంతో రాత్రి కాబట్టి రెస్టారెంట్ కు వెళ్లలేదు. ఉదయం కాగానే.. వెంటనే రెస్టారెంట్ కు వెళ్లి ఆ యజమానితో గొడవకు దిగారు. అసలు.. చికెన్ ముక్కలు ఎందుకు తక్కువ వేశావంటూ యజమానిపై సీరియస్ అయ్యారు. ఈ విషయంపై యజమాని, యువకుల మధ్య గొడవ పెరిగి పెద్దదయింది. దీంతో అది చివరకు కొట్టుకునే స్థాయి వరకు వెళ్లింది.
Crime News : రెస్టారెంట్ యజమానిపై దాడి చేసి పారిపోయిన యువకులు
యువకులు కోపం ఎక్కువగా రావడంతో రెస్టారెంట్ యజమానిపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. దీంతో రెస్టారెంట్ యజమాని.. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశవాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఒక చికెన్ ముక్క కోసం ఇంత దారుణంగా ప్రవర్తించాలా? అంటూ అక్కడి స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం లేపింది.