Nellore.. వైసీపీ బలోపేతానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలి: కోటంరెడ్డి
వైసీపీ ఇప్పటికే ప్రజల్లో బలంగా ఉందని కానీ, ఇంకా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నెల్లూరు రూరల్ శాసన సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సోమవారం ఎమ్మెల్యే శ్రీధర్ 27, 28 డివిజన్లకు చెందిన వైసీపీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ వైసీపీ బలోపేతానికి ప్రతీ ఒక్కరు శక్తివంచన లేకుండా కృషి చేయాలని సూచించారు.
రాష్ట్రంలో బలమైన, తిరుగులేని రాజకీయ శక్తిగా వైసీపీ ఉందని చెప్పారు. స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు పార్టీ దృష్టికి తీసుకురావాలని కోరారు. స్థానికంగా ఉన్న సమస్యల గురించి చర్చించారు. తమ ప్రాంతంలో సమస్య నేతలు చొరవ తీసుకుని అక్కడకు వెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేయాలని, పార్టీ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలోనూ ముందుండాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి సూచించారు. పార్టీ బలోపేతం కోసం ప్రతీ ఒక్కరు చిత్తశుద్ధితో పని చేయాలని, నేతలందరూ ఐక్యంగా ఉండాలని పేర్కొన్నారు. ఎక్కడున్నా సమావేశంలో స్థానిక వేసీపీ నేతలు పాల్గొన్నారు.