Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : బంగారం పేరు వింటేనే పేద, మధ్య తరగతి ప్రజల్లో వణుకు వస్తోంది. ఎందుకంటే.. బంగారం ధరలు ప్రస్తుతం అంతలా ఆకాశాన్ని అంటాయి. అయితే.. ఒకప్పుడు బంగారం ధరలు అంటే పెరగడంతో పాటు తగ్గుతూ ఉండేవి. కానీ.. ఇప్పుడు బంగారం ధరలు అంటే పెరగడమే కానీ.. తగ్గడం మాత్రం లేదు. నేటి శుభకార్యాల్లో బంగారం కొనాలంటేనే భయపడుతున్నారు జనాలు. ఒకప్పుడు శుభకార్యం అంటే బంగారం కొనడానికి ఏమాత్రం వెనకాడని జనాలు.. ప్రస్తుతం బంగారం […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :9 May 2022,9:00 am

Today Gold Rates : బంగారం పేరు వింటేనే పేద, మధ్య తరగతి ప్రజల్లో వణుకు వస్తోంది. ఎందుకంటే.. బంగారం ధరలు ప్రస్తుతం అంతలా ఆకాశాన్ని అంటాయి. అయితే.. ఒకప్పుడు బంగారం ధరలు అంటే పెరగడంతో పాటు తగ్గుతూ ఉండేవి. కానీ.. ఇప్పుడు బంగారం ధరలు అంటే పెరగడమే కానీ.. తగ్గడం మాత్రం లేదు. నేటి శుభకార్యాల్లో బంగారం కొనాలంటేనే భయపడుతున్నారు జనాలు. ఒకప్పుడు శుభకార్యం అంటే బంగారం కొనడానికి ఏమాత్రం వెనకాడని జనాలు.. ప్రస్తుతం బంగారం ధర మార్క్ తులానికి 50 వేలు క్రాస్ కావడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇక.. ఇవాళ బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.

24 april 2022 today gold rates in telugu states

24 april 2022 today gold rates in telugu states

దేశవ్యాప్తంగా ఇవాళ ఒక గ్రాము వెండి 22 క్యారెట్లకు రూ.4740గా ఉంది. 10 గ్రాములకు రూ.47,400గా ఉంది. 24 క్యారెట్లకు ఒక గ్రాముకు రూ.5171గా ఉంది. 10 గ్రాములకు రూ.51,710గా ఉంది. నిన్నటి ధరలో పోల్చితే ఇవాళ బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.47,400 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,710గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్లకు రూ.48,770, 24 క్యారెట్లకు రూ.53,200 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్లకు రూ.47,400, 24 క్యారెట్లకు రూ.51,710 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్లకు రూ.47,400 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,710గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్లకు రూ.47,400 కాగా24 క్యారెట్లకు రూ.51,710 గా ఉంది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే.. హైదరాబాద్ లో 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లకు రూ.47,400 గా ఉంది. 24 క్యారెట్లకు రూ.51,710 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్లకు 10 గ్రాములకు రూ.47,400, 24 క్యారెట్లకు రూ.51,710 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్లకు రూ.47,400 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,790గా ఉంది.

వెండి ధరలు చూసుకుంటే.. నిన్నటి ధరతో పోల్చితే స్థిరంగా ఉన్నాయి. ఒక గ్రాము వెండి ధర.. రూ.62.50 గా ఉంది. 10 గ్రాములకు రూ.625, కిలో వెండి ధర రూ.62,500 గా ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.625 కాగా.. కిలో వెండి ధర రూ.62500గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 10 గ్రాముల వెండి ధర రూ.668 కాగా… కిలో వెండి ధర రూ.66800గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలోనూ అదే ధర ఉంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది