Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. బంగారం కంటే విలువైన వస్తువులు ఎన్నో ఉన్నాయి. కానీ.. బంగారానికి ఉన్న డిమాండే వేరు. బంగారాన్ని ఎక్కువగా ఆభరణాలుగా చేసుకొని మెడలో వేసుకోవడానికి మహిళలు ఇష్టపడతారు. మహిళలకు బంగారం అంటే పిచ్చి ప్రేమ. అదే.. దానికి ఎక్కువ డిమాండ్ వచ్చేలా చేసింది. పెళ్లి అయినా.. బారసాల అయినా.. పెద్దమనిషి ఫంక్షన్ అయినా ఇంట్లో ఏ శుభకార్యం అయినా అక్కడ ఎక్కువగా మాట్లాడుకునేది బంగారం […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :11 July 2022,9:00 am

Today Gold Rates : ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. బంగారం కంటే విలువైన వస్తువులు ఎన్నో ఉన్నాయి. కానీ.. బంగారానికి ఉన్న డిమాండే వేరు. బంగారాన్ని ఎక్కువగా ఆభరణాలుగా చేసుకొని మెడలో వేసుకోవడానికి మహిళలు ఇష్టపడతారు. మహిళలకు బంగారం అంటే పిచ్చి ప్రేమ. అదే.. దానికి ఎక్కువ డిమాండ్ వచ్చేలా చేసింది. పెళ్లి అయినా.. బారసాల అయినా.. పెద్దమనిషి ఫంక్షన్ అయినా ఇంట్లో ఏ శుభకార్యం అయినా అక్కడ ఎక్కువగా మాట్లాడుకునేది బంగారం గురించే. మహిళలు ఏ శుభకార్యానికి వెళ్లినా.. మెడలో బంగారం వేసుకోకుండా మాత్రం వెళ్లరు. ఒకప్పుడు బంగారానికి ఇంత డిమాండ్ లేదు.. అంత కాస్ట్ లీ కూడా కాదు. కానీ.. ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. కొన్ని రోజులు స్వల్పంగా తగ్గినా.. మళ్లీ పెరుగుతూనే ఉన్నాయి. మొన్న బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్న బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఇవాళ బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.

2022 april 12th today gold rates in telugu states

ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు రూ.4695 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. 10 గ్రాముల బంగారం ధర రూ.46,950 గా ఉంది. 10 గ్రాముల బంగారంపై కూడా ఎలాంటి మార్పు లేదు. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు రూ.5121 గా ఉంది. 10 గ్రాముల బంగారం ధర రూ.51,210 గా ఉంది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

దేశవ్యాప్తంగా చూసుకుంటే చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,890 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,150 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,950 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,210 గా ఉంది. ఢిల్లీ, కోల్ కతాలోనూ అదే ధర ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,980 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,250 గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,950 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,210 గా ఉంది.

ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర రూ.57.20 గా ఉంది. 10 గ్రాముల వెండి ధర రూ.572 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ఎలాంటి మార్పు లేదు. కేజీ వెండి ధర రూ.57,200 గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల వెండి ధర రూ.628 కాగా.. కిలో వెండి ధర రూ.62800 గా ఉంది.

ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.572 కాగా.. కిలో వెండి ధర రూ.57200 గా ఉంది. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.628 కాగా.. కిలో వెండి ధర రూ.62800 గా ఉంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది