Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన పసిడి, వెండి ధరలు.. ఎంతో తెలుసా?
Today Gold Rates : ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అంతర్జాతీయ పరిస్థితులు ఒక కారణం అయితే.. బంగారానికి పెరుగుతున్న డిమాండ్ మరో కారణం. పెట్రోలు ధరలు ఎలా అయితే పెరుగుతూ పోతున్నాయో.. బంగారం ధరలు కూడా విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతూ పోతున్నాయి. తులం బంగారం కొనాలంటే.. 50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి నేడు నెలకొన్నది. అందుకే.. పేద, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనాలంటేనే […]
Today Gold Rates : ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అంతర్జాతీయ పరిస్థితులు ఒక కారణం అయితే.. బంగారానికి పెరుగుతున్న డిమాండ్ మరో కారణం. పెట్రోలు ధరలు ఎలా అయితే పెరుగుతూ పోతున్నాయో.. బంగారం ధరలు కూడా విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతూ పోతున్నాయి. తులం బంగారం కొనాలంటే.. 50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి నేడు నెలకొన్నది. అందుకే.. పేద, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనాలంటేనే దడుసుకుంటున్నారు. దాని జోలికే పోవడం లేదు. గత కొన్ని రోజుల నుంచి వరుసగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ వెళ్లాయి. ఆ మధ్య కొన్ని రోజులు బంగారం ధరలు తగ్గాయి. తర్వాత కొన్ని రోజులు బంగారం, వెండి ధరలు పెరిగాయి. మొన్న మళ్లీ పసిడి ధరలు తగ్గాయి. నిన్న కూడా బంగారం, వెండి ధరలు షాకిచ్చాయి. కానీ.. ఈరోజు మళ్లీ బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి.
ఒక గ్రాము బంగారం ధర ఇవాళ రూ.4775గా ఉంది. అది 22 క్యారెట్ల బంగారం. అంటే నిన్నటి ధరతో పోల్చితే రూ.20 తగ్గిందన్నమాట. 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లకు రూ.47,750 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.200 ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.5210 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.21 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.52100 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.210 తగ్గింది.
Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,850 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,200 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 కాగా.. 24 క్యారెట్ల బంగారం రూ.52,100 గా ఉంది. ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరులోనూ అదే ధర ఉంది. తెలుగు రాష్ట్రాల్లో చూస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలోనూ అదే ధర ఉంది.
ఇక.. వెండి ధరలు చూసుకుంటే వెండి ఒక గ్రాముకు రూ.61 ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.1.20 తగ్గింది. 10 గ్రాముల వెండి ధర రూ.610 కాగా.. నిన్నటి ధరతో పోల్చితే రూ.12 తగ్గింది. కిలో వెండి ధర రూ.61,000 ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ఏకంగా రూ.1200 తగ్గింది.
చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కేరళ, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.670 కాగా.. కిలో వెండి ధర రూ.67000 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతా, పూణేలో 10 గ్రాముల వెండి ధర రూ.610 కాగా.. కిలో వెండి ధర రూ.61000 గా ఉంది.