Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్… తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్… తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : అంతర్జాతీయంగా ఏర్పడుతున్న సంక్షోభ పరిస్థితుల వల్ల బంగారం ధరలు ఓవైపు పెరుగుతూ వెళ్తున్నాయి. మరోవైపు బంగారానికి ఈ మధ్య విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. దీంతో బంగారం కొనుగోళ్లు ఎక్కువైపోయాయి. దాని వల్ల కూడా బంగారం ధరలు పెరుగుతున్నాయి. కానీ.. ప్రస్తుతం బంగారం పేరు వింటేనే పేద, మధ్య తరగతి ప్రజల్లో వణుకు పుడుతోంది. అంతలా వాటి ధరలు ఆకాశానికి అంటితే సాధారణ ప్రజలు బంగారాన్ని ఎలా కొనుగోలు చేసేది. ప్రస్తుతం తులం […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :11 May 2022,9:00 am

Today Gold Rates : అంతర్జాతీయంగా ఏర్పడుతున్న సంక్షోభ పరిస్థితుల వల్ల బంగారం ధరలు ఓవైపు పెరుగుతూ వెళ్తున్నాయి. మరోవైపు బంగారానికి ఈ మధ్య విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. దీంతో బంగారం కొనుగోళ్లు ఎక్కువైపోయాయి. దాని వల్ల కూడా బంగారం ధరలు పెరుగుతున్నాయి. కానీ.. ప్రస్తుతం బంగారం పేరు వింటేనే పేద, మధ్య తరగతి ప్రజల్లో వణుకు పుడుతోంది. అంతలా వాటి ధరలు ఆకాశానికి అంటితే సాధారణ ప్రజలు బంగారాన్ని ఎలా కొనుగోలు చేసేది. ప్రస్తుతం తులం బంగారం కొనాలంటే రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు.. ఇవాళ కాస్త ఊరటనిచ్చాయి. బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇవాళ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.

24 april 2022 today gold rates in telugu states

24 april 2022 today gold rates in telugu states

దేశ వ్యాప్తంగా ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4710గా ఉంది. అంటే ఒక గ్రాము మీద రూ.40 తగ్గింది. నిన్న ఒక గ్రాము బంగారం ధర రూ.4750గా ఉండేది. 10 గ్రాములకు రూ.47,100 గా ఉంది. నిన్న 10 గ్రాములకు రూ.47,500గా ఉండేది. 10 గ్రాముల మీద రూ.400 తగ్గింది. ఇక 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాము ధర ఇవాళ రూ.5138గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.43 తగ్గింది. 10 గ్రాములకు రూ.51380గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.430 తగ్గింది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,100గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,380గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,460గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,860గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,100గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,380గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,100గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,380గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,100గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,380గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే.. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర ఇవాళ రూ.47,100 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,380గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం రూ.47,100 కాగా.. 24 క్యారెట్ల బంగారం రూ.51,380గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం రూ.47,100 కాగా.. 24 క్యారెట్ల బంగారం రూ.51,380గా ఉంది.

ఇక.. వెండి ధరలు చూసుకుంటే.. ఇవాళ గ్రాముకు రూ.61.90గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే గ్రాముకు రూ.60 పైసలు తగ్గింది. 10 గ్రాములుకు రూ.619 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.6 తగ్గింది. కిలో బంగారం ధర ఇవాళ రూ.61,900గా ఉంది. అంటే కిలో పేరు మీద ఇవాళ రూ.600 తగ్గింది.

చెన్నైలో 10 గ్రాముల వెండి ధర రూ.661 కాగా.. కిలో బంగారం ధర రూ.66,100. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాములకు రూ.619, కిలోకు రూ.61,900గా ఉంది. బెంగళూరులో 10 గ్రాములకు రూ.661, కిలోకు రూ.66100గా ఉంది. హైదరాబాద్ లో 10 గ్రాముల వెండి ధర రూ.661 కాగా.. కిలో వెండిపై రూ.66100గా ఉంది.

విజయవాడలో 10 గ్రాముల వెండి ధర రూ.661 కాగా.. కిలో వెండి ధర రూ.66100గా ఉంది. విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.661 కాగా.. కిలో వెండి ధర రూ.66100గా ఉంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది