Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : Today Gold Rates : అంతర్జాతీయంగా ఏర్పడుతున్న సంక్షోభ పరిస్థితుల వల్ల బంగారం ధరలు ఓవైపు పెరుగుతూ వెళ్తున్నాయి. మరోవైపు బంగారానికి ఈ మధ్య విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. దీంతో బంగారం కొనుగోళ్లు ఎక్కువైపోయాయి. దాని వల్ల కూడా బంగారం ధరలు పెరుగుతున్నాయి. కానీ.. ప్రస్తుతం బంగారం పేరు వింటేనే పేద, మధ్య తరగతి ప్రజల్లో వణుకు పుడుతోంది. అంతలా వాటి ధరలు ఆకాశానికి అంటితే సాధారణ ప్రజలు బంగారాన్ని ఎలా […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :12 May 2022,9:00 am

Today Gold Rates : Today Gold Rates : అంతర్జాతీయంగా ఏర్పడుతున్న సంక్షోభ పరిస్థితుల వల్ల బంగారం ధరలు ఓవైపు పెరుగుతూ వెళ్తున్నాయి. మరోవైపు బంగారానికి ఈ మధ్య విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. దీంతో బంగారం కొనుగోళ్లు ఎక్కువైపోయాయి. దాని వల్ల కూడా బంగారం ధరలు పెరుగుతున్నాయి. కానీ.. ప్రస్తుతం బంగారం పేరు వింటేనే పేద, మధ్య తరగతి ప్రజల్లో వణుకు పుడుతోంది. అంతలా వాటి ధరలు ఆకాశానికి అంటితే సాధారణ ప్రజలు బంగారాన్ని ఎలా కొనుగోలు చేసేది. ప్రస్తుతం తులం బంగారం కొనాలంటే రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు.. ఇవాళ కాస్త ఊరటనిచ్చాయి. బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇవాళ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.

08 May 2022 today gold Rates in Telugu states

08 May 2022 today gold Rates in Telugu states

22 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు ఇవాళ రూ.4675గా ఉంది. అంటే.. నిన్నటి ధరతో పోల్చితే రూ.35 తగ్గింది. అలాగే.. 10 గ్రాములకు 22 క్యారెట్లకు రూ.46,750 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.350 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు రూ.5100 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.38 తగ్గింది. 10 గ్రాములకు రూ.51,000 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.380 తగ్గింది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్లకు రూ.46,750 ఉండగా.. 24 క్యారెట్లకు రూ.51,000గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్లకు రూ.47,870 కాగా.. 24 క్యారెట్లకు రూ.52,220 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్లకు రూ.46,750 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,000 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్లకు రూ.46,750 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,000 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్లకు రూ.46,750 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,000 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే.. హైదరాబాద్ లో 22 క్యారెట్లకు రూ.46,750 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,000 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్లకు రూ.46,750 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,000గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్లకు రూ.46,750 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,000 గా ఉంది.

ఇక.. వెండి ధరలు చూసుకుంటే.. ఇవాళ ఒక గ్రాము వెండి ధర రూ.60.40 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.1.50 తగ్గింది. 10 గ్రాములకు వెండి ధర ఈరోజు రూ.604 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.15 తగ్గింది. కిలో బంగారానికి రూ.60,400 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.1500 తగ్గింది.

ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాములకు రూ.604 కాగా.. కిలో వెండి ధర రూ.60,400 గా ఉంది. చెన్నైలో 10 గ్రాములకు రూ.648 కాగా.. కిలో వెండి ధర రూ.64800గా ఉంది. హైదరాబాద్ లో 10 గ్రాముల వెండి ధర రూ.648 కాగా.. కిలో వెండి ధర రూ.64800 గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలోనూ అదే ధర ఉంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది