Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?
Today Gold Rates : ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. బంగారం కంటే విలువైన వస్తువులు ఎన్నో ఉన్నాయి. కానీ.. బంగారానికి ఉన్న డిమాండే వేరు. బంగారాన్ని ఎక్కువగా ఆభరణాలుగా చేసుకొని మెడలో వేసుకోవడానికి మహిళలు ఇష్టపడతారు. మహిళలకు బంగారం అంటే పిచ్చి ప్రేమ. అదే.. దానికి ఎక్కువ డిమాండ్ వచ్చేలా చేసింది. పెళ్లి అయినా.. బారసాల అయినా.. పెద్దమనిషి ఫంక్షన్ అయినా ఇంట్లో ఏ శుభకార్యం అయినా అక్కడ ఎక్కువగా మాట్లాడుకునేది బంగారం […]
Today Gold Rates : ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. బంగారం కంటే విలువైన వస్తువులు ఎన్నో ఉన్నాయి. కానీ.. బంగారానికి ఉన్న డిమాండే వేరు. బంగారాన్ని ఎక్కువగా ఆభరణాలుగా చేసుకొని మెడలో వేసుకోవడానికి మహిళలు ఇష్టపడతారు. మహిళలకు బంగారం అంటే పిచ్చి ప్రేమ. అదే.. దానికి ఎక్కువ డిమాండ్ వచ్చేలా చేసింది. పెళ్లి అయినా.. బారసాల అయినా.. పెద్దమనిషి ఫంక్షన్ అయినా ఇంట్లో ఏ శుభకార్యం అయినా అక్కడ ఎక్కువగా మాట్లాడుకునేది బంగారం గురించే. మహిళలు ఏ శుభకార్యానికి వెళ్లినా.. మెడలో బంగారం వేసుకోకుండా మాత్రం వెళ్లరు. ఒకప్పుడు బంగారానికి ఇంత డిమాండ్ లేదు.. అంత కాస్ట్ లీ కూడా కాదు. కానీ.. ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. కొన్ని రోజులు స్వల్పంగా తగ్గినా.. మళ్లీ పెరుగుతూనే ఉన్నాయి. మొన్న బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. నిన్న బంగారం ధర స్వల్పంగా తగ్గి.. వెండి ధరలు భారీగా పెరిగాయి. మరోవైపు ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గాయి.
ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4670 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.10 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లకు రూ.46,700 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.100 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాము ధర ఇవాళ రూ.5095 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.10.40 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.50950 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.104 తగ్గింది.
Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,600 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,840 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,700 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,950 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,740 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000 గా ఉంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,700 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,950 గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలోనూ అదే ధర ఉంది.
ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.56.40 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.6.10 తగ్గింది. 10 గ్రాముల వెండి ధర రూ.564 కాగా.. నిన్నటి ధరతో పోల్చితే రూ.61 తగ్గింది. కిలో వెండి ధర రూ.56,400 కాగా.. నిన్నటి ధరతో పోల్చితే రూ.6100 తగ్గింది.
చెన్నైలో 10 గ్రాముల వెండి ధర రూ.617 కాగా.. కిలో వెండి ధర రూ.61700 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.564 కాగా.. కిలో వెండి ధర రూ.56400 గా ఉంది. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.617 కాగా.. కిలో వెండి ధర రూ.61700 గా ఉంది.