Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. స్థిరంగా పసిడి.. తగ్గిన వెండి ధరలు.. ఎంతో తెలుసా?
Today Gold Rates : ఈరోజుల్లో బంగారం కొనగలుగుతామా? ఒక్క తులం బంగారం కొనాలంటే వేలకు వేలు పెట్టాల్సిందే. తులం బంగారం కోసం 50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి నేడు నెలకొన్నది. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు ఒక కారణం అయితే.. బంగారానికి పెరుగుతున్న డిమాండ్ మరో కారణం. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతూ వెళ్తున్నాయి. అందుకే.. పేద, మధ్యతరగతి జనాలు బంగారం కొనాలంటేనే దడుసుకుంటున్నారు. రోజురోజుకూ బంగారం, వెండి ధరలు పెరుగుతూ ఉన్నాయి […]
Today Gold Rates : ఈరోజుల్లో బంగారం కొనగలుగుతామా? ఒక్క తులం బంగారం కొనాలంటే వేలకు వేలు పెట్టాల్సిందే. తులం బంగారం కోసం 50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి నేడు నెలకొన్నది. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు ఒక కారణం అయితే.. బంగారానికి పెరుగుతున్న డిమాండ్ మరో కారణం. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతూ వెళ్తున్నాయి. అందుకే.. పేద, మధ్యతరగతి జనాలు బంగారం కొనాలంటేనే దడుసుకుంటున్నారు. రోజురోజుకూ బంగారం, వెండి ధరలు పెరుగుతూ ఉన్నాయి తప్పితే తగ్గడం లేదు. మధ్యలో కొన్ని రోజులు తగ్గినా.. మళ్లీ పెరుగుతూనే ఉన్నాయి. మొన్న బంగారం, వెండి ధరలు పెరిగాయి. నిన్న మాత్రం బంగారం ధరలు పెరిగి, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. తాజాగా ఇవాళ బంగారం ధరలు స్థిరంగా ఉండగా.. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి.
ఒక గ్రాము బంగారం ధర ఇవాళ 22 క్యారెట్లకు రూ.4836 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ధరలో ఎలాంటి మార్పు లేదు. 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లకు రూ.48,360 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.5276 గా ఉంది. 10 గ్రాముల బంగారం ధర రూ.52,760 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 22, 24 క్యారెట్ల బంగారంలో ఎలాంటి మార్పు లేదు. ధరలు స్థిరంగా ఉన్నాయి.
Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,430 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,830 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,360 కాగా.. 24 క్యారెట్ల బంగారం రూ.52,760 గా ఉంది. ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరులోనూ అదే ధర ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే.. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,360 కాగా… 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,760 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,360 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,760 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,360 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,760 గా ఉంది.
వెండి ధరలు చూసుకుంటే.. ఇవాళ ఒక గ్రాము వెండి ధర రూ.61.50 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 50 పైసలు తగ్గింది. 10 గ్రాముల వెండి ధర రూ.615 కాగా.. నిన్నటి ధరతో పోల్చితే రూ.5 తగ్గింది. కిలో వెండి ధర రూ.61,500 కాగా… నిన్నటి ధరతో పోల్చితే రూ.500 తగ్గింది.
చెన్నైలో 10 గ్రాముల వెండి ధర రూ.673 కాగా.. కిలో వెండి ధర రూ.67300 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.615 కాగా.. కిలో వెండి ధర రూ.61500 గా ఉంది. బెంగళూరులో 10 గ్రాముల వెండి ధర రూ.673 కాగా.. కిలో వెండి ధర రూ.67300గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో చూస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.673 కాగా… కిలో వెండి ధర రూ.67300 గా ఉంది.