Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : ఈరోజుల్లో బంగారం కొనగలుగుతామా? ఒక్క తులం బంగారం కొనాలంటే వేలకు వేలు పెట్టాల్సిందే. తులం బంగారం కోసం 50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి నేడు నెలకొన్నది. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు ఒక కారణం అయితే.. బంగారానికి పెరుగుతున్న డిమాండ్ మరో కారణం. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతూ వెళ్తున్నాయి. అందుకే.. పేద, మధ్యతరగతి జనాలు బంగారం కొనాలంటేనే దడుసుకుంటున్నారు. రోజురోజుకూ బంగారం, వెండి ధరలు పెరుగుతూ ఉన్నాయి […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :16 June 2022,9:00 am

Today Gold Rates : ఈరోజుల్లో బంగారం కొనగలుగుతామా? ఒక్క తులం బంగారం కొనాలంటే వేలకు వేలు పెట్టాల్సిందే. తులం బంగారం కోసం 50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి నేడు నెలకొన్నది. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు ఒక కారణం అయితే.. బంగారానికి పెరుగుతున్న డిమాండ్ మరో కారణం. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతూ వెళ్తున్నాయి. అందుకే.. పేద, మధ్యతరగతి జనాలు బంగారం కొనాలంటేనే దడుసుకుంటున్నారు. రోజురోజుకూ బంగారం, వెండి ధరలు పెరుగుతూ ఉన్నాయి తప్పితే తగ్గడం లేదు. మధ్యలో కొన్ని రోజులు తగ్గినా.. మళ్లీ పెరుగుతూనే ఉన్నాయి. మొన్న మాత్రం బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. నిన్న బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇవాళ బంగారం ధరలు తగ్గగా.. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.

24 april 2022 today gold rates in telugu states

ఒక గ్రాము బంగారం 22 క్యారెట్లకు ఇవాళ రూ.4715 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.25 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ఇవాళ రూ.47,150 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.250 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాము ధర రూ.5144 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.27 తగ్గింది. 10 గ్రాముల బంగారం రూ.51,440 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.270 తగ్గింది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,200 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,500 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,150 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,440 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,170 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,440 గా ఉంది. కోల్ కతా, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,150 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,440 గా ఉంది.

ఇక.. వెండి ధరలు తీసుకుంటే.. ఇవాళ వెండి దరలు స్వల్పంగా పెరిగాయి. ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.60 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 20 పైసలు పెరిగింది. 10 గ్రాముల వెండి ధర రూ.600 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.2 పెరిగింది. కిలో వెండి ధర రూ.60,000 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.200 పెరిగింది.

చెన్నైలో 10 గ్రాముల వెండి ధర రూ.660 కాగా.. కిలో వెండి ధర రూ.66000 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.600 కాగా.. కిలో వెండి ధర రూ.60000 గా ఉంది. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.660 కాగా.. కిలో వెండి ధర రూ.66000 గా ఉంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది