Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం.. పెరిగిన వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం.. పెరిగిన వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. బంగారం కంటే విలువైన వస్తువులు ఎన్నో ఉన్నాయి. కానీ.. బంగారానికి ఉన్న డిమాండే వేరు. బంగారాన్ని ఎక్కువగా ఆభరణాలుగా చేసుకొని మెడలో వేసుకోవడానికి మహిళలు ఇష్టపడతారు. మహిళలకు బంగారం అంటే పిచ్చి ప్రేమ. అదే.. దానికి ఎక్కువ డిమాండ్ వచ్చేలా చేసింది. పెళ్లి అయినా.. బారసాల అయినా.. పెద్దమనిషి ఫంక్షన్ అయినా ఇంట్లో ఏ శుభకార్యం అయినా అక్కడ ఎక్కువగా మాట్లాడుకునేది బంగారం […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :17 July 2022,8:59 am

Today Gold Rates : ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. బంగారం కంటే విలువైన వస్తువులు ఎన్నో ఉన్నాయి. కానీ.. బంగారానికి ఉన్న డిమాండే వేరు. బంగారాన్ని ఎక్కువగా ఆభరణాలుగా చేసుకొని మెడలో వేసుకోవడానికి మహిళలు ఇష్టపడతారు. మహిళలకు బంగారం అంటే పిచ్చి ప్రేమ. అదే.. దానికి ఎక్కువ డిమాండ్ వచ్చేలా చేసింది. పెళ్లి అయినా.. బారసాల అయినా.. పెద్దమనిషి ఫంక్షన్ అయినా ఇంట్లో ఏ శుభకార్యం అయినా అక్కడ ఎక్కువగా మాట్లాడుకునేది బంగారం గురించే. మహిళలు ఏ శుభకార్యానికి వెళ్లినా.. మెడలో బంగారం వేసుకోకుండా మాత్రం వెళ్లరు. ఒకప్పుడు బంగారానికి ఇంత డిమాండ్ లేదు.. అంత కాస్ట్ లీ కూడా కాదు. కానీ.. ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. కొన్ని రోజులు స్వల్పంగా తగ్గినా.. మళ్లీ పెరుగుతూనే ఉన్నాయి. మొన్న బంగారం, వెండి రెండు ధరలు స్వల్పంగా పెరిగాయి. నిన్న బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇవాళ బంగారం ధరలు తగ్గినా.. వెండి ధరలు పెరిగాయి.

08 May 2022 today gold Rates in Telugu states

ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4620 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.30 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.46,200 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.300 తగ్గింది. 24 క్యారెట్లకు ఒక గ్రాము బంగారం ధర రూ.5040 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.33 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.50,400 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.330 తగ్గింది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

దేశ వ్యాప్తంగా బంగారం ధరలు చూసుకుంటే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,270 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,480 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,200 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,400 గా ఉంది. ఢిల్లీ, కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,200 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,400 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,300 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,510 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చూస్తే.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,200 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,400 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,200 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,400 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,200 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,400 గా ఉంది.

ఇక.. వెండి ధరలు చూస్తే.. ఇవాళ వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఒక గ్రాము వెండి ధర రూ.55.60 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 60 పైసలు పెరిగింది. 10 గ్రాముల వెండి ధర రూ.556 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.6 పెరిగింది. కిలో వెండి ధర రూ.55,600 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.600 పెరిగింది.

చెన్నైలో 10 గ్రాముల వెండి ధర రూ.607 కాగా.. కిలో వెండి ధర రూ.60700 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.556 కాగా.. కిలో వెండి ధర రూ.55600 గా ఉంది. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.607 కాగా.. కిలో వెండి ధర రూ.60700 గా ఉంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది