Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : ఈరోజుల్లో బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. తులం బంగారం కొనాలంటే 50 వేలకు పైగా వెచ్చించాలి. ఒకప్పుడు బంగారం కొనాలంటే పెద్దగా ఆలోచించేవారు కాదు జనాలు. పేద, మధ్య తరగతి ప్రజలు కూడా శుభకార్యాలకు అంతో ఇంతో బంగారాన్ని కొనుక్కునే వారు. కానీ.. పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అంతర్జాతీయ పరిస్థితులు ఒక కారణం అయితే.. బంగారానికి పెరుగుతున్న డిమాండ్ మరో కారణం. పెట్రోలు ధరలు ఎలా […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :2 June 2022,9:00 am

Today Gold Rates : ఈరోజుల్లో బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. తులం బంగారం కొనాలంటే 50 వేలకు పైగా వెచ్చించాలి. ఒకప్పుడు బంగారం కొనాలంటే పెద్దగా ఆలోచించేవారు కాదు జనాలు. పేద, మధ్య తరగతి ప్రజలు కూడా శుభకార్యాలకు అంతో ఇంతో బంగారాన్ని కొనుక్కునే వారు. కానీ.. పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అంతర్జాతీయ పరిస్థితులు ఒక కారణం అయితే.. బంగారానికి పెరుగుతున్న డిమాండ్ మరో కారణం. పెట్రోలు ధరలు ఎలా అయితే పెరుగుతూ పోతున్నాయో.. బంగారం ధరలు కూడా విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతూ పోతున్నాయి. గత కొన్నిరోజుల నుంచి వరుసగా పెరుగుతూ వెళ్తున్న బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ప్రజలకు కాస్త ఊరటనిస్తున్నాయి. మొన్న బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్న మాత్రం బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఇవాళ కూడా బంగారం, వెండి ధరలు తగ్గాయి.

24 april 2022 today gold rates in telugu states

22 క్యారెట్ల బంగారం ఒక గ్రాము ధర ఇవాళ రూ.4750 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.25 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లకు రూ.47,500 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.250 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు రూ.5182 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.28 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.51820 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.280 తగ్గింది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

దేశ వ్యాప్తంగా మెట్రో నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే… చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.47,400 కాగా.. 24 క్యారెట్ల బంగారం రూ.51,710 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.47,500 కాగా.. 24 క్యారెట్ల బంగారం రూ.51,820 గా ఉంది. ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరులోనూ అదే ధర ఉంది. ఇక… తెలుగు రాష్ట్రాల్లో చూస్తే.. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,500 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,820 గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలోనూ అదే ధర ఉంది.

ఇక.. వెండి ధరలు చూసుకుంటే.. ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.60.60 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూపాయి తగ్గింది. 10 గ్రాముల వెండి ధర రూ.606 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.10 తగ్గింది. కిలో వెండి ధర రూ.60,600 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.1000 తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.670 కాగా.. కిలో వెండి ధర రూ.67000 గా ఉంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది