Today Gold Rates : మహిళలకు బ్యాడ్‌న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఎంత పెరిగాయంటే..!
Today Gold Rates : బంగారం ధరలు మరోసారి పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరలు రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయి. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు తగ్గటమో లేక స్థిరంగా ఉండటమో జరుగుతూ వచ్చింది. అయితే గత మూడు రోజులుగా పసిడి ధరల్లో పెరుగుదల నమోదు అవుతోంది. నిన్నటి లాగే దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు కూడా పలు చోట్ల మార్పు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఎలా […]
Today Gold Rates : బంగారం ధరలు మరోసారి పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరలు రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయి. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు తగ్గటమో లేక స్థిరంగా ఉండటమో జరుగుతూ వచ్చింది. అయితే గత మూడు రోజులుగా పసిడి ధరల్లో పెరుగుదల నమోదు అవుతోంది. నిన్నటి లాగే దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు కూడా పలు చోట్ల మార్పు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.ముందుగా దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే.. ఆభరణాల తయారీలో ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర రూ.45, 800 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 49, 970గా ఉంది.
ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45, 800 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49, 970 గా ఉంది. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45, 800 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49, 979 గా ఉంది. ఏపీ లోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45, 800 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 49, 970 గా ఉంది.బంగారం ధరలు ఇలా ఉండగా నేడు వెండి ధరల్లో మాత్రం ఏమాత్రం మార్పు లేదు. దేశంలోని ప్రముఖ నగరాలతో పాటు చెన్నై, హైదరాబాదులలోనూ వెండి ధరలు స్థిరంగానే ఉన్నాయి.
ఆయా చోట్ల కేజీ వెండి ధర ప్రస్తుతం రూ. 66, 800 గా ఉంది. అయితే బులియన్ మార్కెట్లో బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులు నమోదవుతుంటాయి. నిమిషం నిమిషానికి.. మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. భారీ మొత్తంలో కొనాలి అనుకునే వారు.. ఆ మేరకు ఎప్పటికప్పుడు ధరలను గమనిస్తూ బంగారాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తాజాగా స్థిరంగానో లేదా కొద్ది పాటు హెచ్చు, తగ్గు ధరలను బట్టి చూస్తే వచ్చే వేసవిలో పెళ్లిళ్లు ఉన్న వారు ఇప్పుడే బంగారం కొని పెట్టుకుంటే మంచిదని అంటున్నారు.