Today Gold Rates : మహిళలకు మరోసారి షాకిచ్చిన బంగారం ధరలు.. తగ్గిన వెండి.. బంగారం ఎంత పెరిగిందో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మహిళలకు మరోసారి షాకిచ్చిన బంగారం ధరలు.. తగ్గిన వెండి.. బంగారం ఎంత పెరిగిందో తెలుసా?

Today Gold Rates : ఈరోజుల్లో బంగారం పేరు ఎత్తితేనే జనాలు భయపడిపోతున్నారు. ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. బంగారం మాత్రమే కాదు.. వెండిని కూడా కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని రోజుల్లో వెండిని కూడా కొనలేము. బంగారం, వెండి రెండు కాస్ట్ లీ అయిపోయాయి. అంతర్జాతీయంగా ఏర్పడుతున్న పరిస్థితులు ఒక కారణం అయితే.. ప్రస్తుతం బంగారం కోసం పెరుగుతున్న డిమాండ్ కూడా మరో కారణం ధరలు పెరగడానికి. ప్రస్తుతం తులం బంగారం కొనాలంటే 50 […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :22 May 2022,9:00 am

Today Gold Rates : ఈరోజుల్లో బంగారం పేరు ఎత్తితేనే జనాలు భయపడిపోతున్నారు. ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. బంగారం మాత్రమే కాదు.. వెండిని కూడా కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని రోజుల్లో వెండిని కూడా కొనలేము. బంగారం, వెండి రెండు కాస్ట్ లీ అయిపోయాయి. అంతర్జాతీయంగా ఏర్పడుతున్న పరిస్థితులు ఒక కారణం అయితే.. ప్రస్తుతం బంగారం కోసం పెరుగుతున్న డిమాండ్ కూడా మరో కారణం ధరలు పెరగడానికి. ప్రస్తుతం తులం బంగారం కొనాలంటే 50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మధ్య బంగారం ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. కొన్ని రోజులు తగ్గాయి. నిన్న బంగారం ధరలు మహిళలకు షాకిచ్చాయి. ఇవాళ కూడా అదే రేంజ్ లో పసిడి ధరలు పెరిగి మరోసారి షాకిచ్చాయి. బంగారం ధరలు ఎంత పెరిగాయో తెలుసుకుందాం రండి.

08 May 2022 today gold Rates in Telugu states

08 May 2022 today gold Rates in Telugu states

దేశ వ్యాప్తంగా ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు రూ.4705 గా ఉంది. ఒక గ్రాము మీద రూ.35 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.47050 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.350 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు రూ.5133 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.38 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.51330 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.380 పెరిగింది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

దేశ వ్యాప్తంగా మెట్రో నగరాల్లో చూస్తే చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,170 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,550 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్లకు రూ.47,050 గా ఉండగా.. 24 క్యారెట్లకు రూ.51,330 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్లకు రూ.47,050 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,330 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్లకు రూ.47,050 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,330 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్లకు రూ.47,050 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,330 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో చూస్తే.. హైదరాబాద్ లో 22 క్యారెట్లకు రూ.47,050 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,330 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్లకు రూ.47,050 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,330 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్లకు రూ.47,050 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,330 గా ఉంది.

ఇక.. వెండి ధరలు మాత్రం ఈ మధ్య ప్రతి రోజు స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. ఒక గ్రాముకు ఇవాళ రూ.61.40 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే గ్రామకు 30 పైసలు తగ్గింది. 10 గ్రాముల వెండి ధర రూ.614 కాగా.. నిన్నటి ధరతో పోల్చితే రూ.3 తగ్గింది. కిలో వెండి ధర ఇవాళ రూ.61,400 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.300 తగ్గింది.

తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు చూస్తే.. హైదరాబాద్ లో 10 గ్రాముల వెండి ధర రూ.659 కాగా.. కిలో వెండి ధర రూ.65900 గా ఉంది. విజయవాడలో 10 గ్రాముల వెండి ధర రూ.659 కాగా.. కిలో వెండి ధర రూ.65900 గా ఉంది. విశాఖపట్టణంలోనూ అదే ధర ఉంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది