Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : ఓవైపు బంగారానికి పెరుగుతున్న డిమాండ్.. మరోవైపు అంతర్జాతీయ పరిస్థితులు.. బంగారం ధరను రోజురోజుకూ పెంచేస్తున్నాయి. పెట్రోల్ ధరలు పెరిగినట్టుగా బంగారం ధరలు కూడా విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. బంగారం ముడి సరుకు ధరలు పెరగడంతో పాటు.. బంగారం వినియోగం కూడా ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగింది. దాని కారణం వల్ల.. బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. బంగారం మాత్రమే కాదు.. వెండిని కూడా […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :24 May 2022,9:00 am

Today Gold Rates : ఓవైపు బంగారానికి పెరుగుతున్న డిమాండ్.. మరోవైపు అంతర్జాతీయ పరిస్థితులు.. బంగారం ధరను రోజురోజుకూ పెంచేస్తున్నాయి. పెట్రోల్ ధరలు పెరిగినట్టుగా బంగారం ధరలు కూడా విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. బంగారం ముడి సరుకు ధరలు పెరగడంతో పాటు.. బంగారం వినియోగం కూడా ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగింది. దాని కారణం వల్ల.. బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. బంగారం మాత్రమే కాదు.. వెండిని కూడా కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి. తులం బంగారం కొనాలంటే 50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మధ్య బంగారం ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. కొన్ని రోజులు తగ్గాయి. మొన్న బంగారం ధరలు మహిళలకు షాకిచ్చాయి. నిన్న మాత్రం స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఇవాళ మరోసారి పెరిగాయి.

08 May 2022 today gold Rates in Telugu states

08 May 2022 today gold Rates in Telugu states

దేశ వ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూస్తే.. 22 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు ఇవాళ రూ.4715 గా ఉంది. అంటే నిన్నటి ధరతో పోల్చితే రూ.10 పెరిగింది. 10 గ్రాములకు రూ.47150 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.100 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు రూ.5143 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.10 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లకు రూ.51,430 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.100 పెరిగింది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

దేశ వ్యాప్తంగా మెట్రో నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,370 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,760 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,150 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,430 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,150 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,430 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,150 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,430 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,150 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,430 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో చూస్తే.. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,150 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,430 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,150 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,430 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,150 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,430 గా ఉంది.

ఇక.. వెండి ధరలు చూసుకుంటే.. నిన్నటి ధరతో పోల్చితే ఒక గ్రాము మీద వెండి 70 పైసలు పెరిగింది. ఒక గ్రాముకు ఇవాళ రూ.62.10 గా ఉంది. 10 గ్రాముల వెండి ధర రూ.621 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.7 పెరిగింది. కిలో వెండి ధర రూ.62,100 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.700 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో చూస్తే హైదరాబాద్ లో 10 గ్రాముల వెండి ధర రూ.665 కాగా… కిలో వెండి ధర రూ.66500 గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలోనూ అదే ధర ఉంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది