Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?
Today Gold Rates : ఓవైపు బంగారానికి పెరుగుతున్న డిమాండ్.. మరోవైపు అంతర్జాతీయ పరిస్థితులు.. బంగారం ధరను రోజురోజుకూ పెంచేస్తున్నాయి. పెట్రోల్ ధరలు పెరిగినట్టుగా బంగారం ధరలు కూడా విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. బంగారం ముడి సరుకు ధరలు పెరగడంతో పాటు.. బంగారం వినియోగం కూడా ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగింది. దాని కారణం వల్ల.. బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. బంగారం మాత్రమే కాదు.. వెండిని కూడా […]
Today Gold Rates : ఓవైపు బంగారానికి పెరుగుతున్న డిమాండ్.. మరోవైపు అంతర్జాతీయ పరిస్థితులు.. బంగారం ధరను రోజురోజుకూ పెంచేస్తున్నాయి. పెట్రోల్ ధరలు పెరిగినట్టుగా బంగారం ధరలు కూడా విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. బంగారం ముడి సరుకు ధరలు పెరగడంతో పాటు.. బంగారం వినియోగం కూడా ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగింది. దాని కారణం వల్ల.. బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. బంగారం మాత్రమే కాదు.. వెండిని కూడా కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి. తులం బంగారం కొనాలంటే 50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మధ్య బంగారం ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. కొన్ని రోజులు తగ్గాయి. మూడునాలుగు రోజుల పాటు వరుసగా పెరిగిన బంగారం ధరలు నిన్న మాత్రం కాస్త ఊరటనిచ్చాయి. మళ్లీ ఇవాళ బంగారం, వెండి ధరలు పెరిగాయి.
దేశవ్యాప్తంగా బంగారం ధరలు చూస్తే.. 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.4775 గా ఉంది. 10 గ్రాములకు రూ.47,750 గా ఉంది. ఒక గ్రాముకు నిన్నటి ధరతో పోల్చితే రూ.10 పెరిగింది. 10 గ్రాములకు నిన్నటి ధరతో పోల్చితే రూ.100 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు రూ.5209 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.11 పెరిగింది. 10 గ్రాములకు రూ.52090 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.110 పెరిగింది.
Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
దేశంలోని ప్రధాన నగరాలైన చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,800 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,150 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముకు రూ.47,750 కాగా.. 24 క్యారెట్ల బంగారం రూ.52090 గా ఉంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం రూ.47,750 కాగా.. 24 క్యారెట్ల బంగారం రూ.52,090 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం రూ.47,750 కాగా 24 క్యారెట్ల బంగారం రూ.52,090 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం రూ.47,750 కాగా 24 క్యారెట్ల బంగారం రూ.52,090 గా ఉంది.
ఇక.. వెండి ధరలు చూసుకుంటే.. ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.62.15 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 65 పైసలు పెరిగింది. 10 గ్రాముల వెండి ధర రూ.621.50 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.6.50 పెరిగింది. కిలో వెండి ధర ఇవాళ రూ.62150 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.650 పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 10 గ్రాముల వెండి ధర రూ.666 కాగా.. కిలో వెండి ధర రూ.66600గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలోనూ అదే ధర ఉంది.