Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం.. తగ్గిన వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం.. తగ్గిన వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. బంగారం కంటే విలువైన వస్తువులు ఎన్నో ఉన్నాయి. కానీ.. బంగారానికి ఉన్న డిమాండే వేరు. బంగారాన్ని ఎక్కువగా ఆభరణాలుగా చేసుకొని మెడలో వేసుకోవడానికి మహిళలు ఇష్టపడతారు. మహిళలకు బంగారం అంటే పిచ్చి ప్రేమ. అదే.. దానికి ఎక్కువ డిమాండ్ వచ్చేలా చేసింది. పెళ్లి అయినా.. బారసాల అయినా.. పెద్దమనిషి ఫంక్షన్ అయినా ఇంట్లో ఏ శుభకార్యం అయినా అక్కడ ఎక్కువగా మాట్లాడుకునేది బంగారం […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :29 June 2022,9:00 am

Today Gold Rates : ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. బంగారం కంటే విలువైన వస్తువులు ఎన్నో ఉన్నాయి. కానీ.. బంగారానికి ఉన్న డిమాండే వేరు. బంగారాన్ని ఎక్కువగా ఆభరణాలుగా చేసుకొని మెడలో వేసుకోవడానికి మహిళలు ఇష్టపడతారు. మహిళలకు బంగారం అంటే పిచ్చి ప్రేమ. అదే.. దానికి ఎక్కువ డిమాండ్ వచ్చేలా చేసింది. పెళ్లి అయినా.. బారసాల అయినా.. పెద్దమనిషి ఫంక్షన్ అయినా ఇంట్లో ఏ శుభకార్యం అయినా అక్కడ ఎక్కువగా మాట్లాడుకునేది బంగారం గురించే. మహిళలు ఏ శుభకార్యానికి వెళ్లినా.. మెడలో బంగారం వేసుకోకుండా మాత్రం వెళ్లరు. ఒకప్పుడు బంగారానికి ఇంత డిమాండ్ లేదు.. అంత కాస్ట్ లీ కూడా కాదు. కానీ.. ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఓవైపు డిమాండ్.. మరోవైపు అంతర్జాతీయ పరిస్థితులు.. ఈ రెండు ప్రస్తుతం బంగారం ధరను ఆకాశానికి ఎక్కేలా చేశాయి. అందుకే.. ఇప్పుడు పేద, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనాలంటేనే జడుసుకుంటున్నారు. రోజురోజుకూ బంగారం ధరలు పెరుగుతున్నాయి తప్పితే తగ్గడం లేదు. కొన్ని రోజులు స్వల్పంగా తగ్గినా.. మళ్లీ పెరుగుతూనే ఉన్నాయి. మొన్న బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్న బంగారం, వెండి రెండు ధరలు పెరిగాయి. ఇవాళ బంగారం ధరలు స్థిరంగా ఉండగా.. వెండి ధరలు తగ్గాయి.

24 april 2022 today gold rates in telugu states

22 క్యారెట్ల బంగారం ఒక గ్రాము ధర రూ.4765 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. 10 గ్రాముల బంగారం ధర రూ.47,650 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 10 గ్రాముల బంగారం కూడా స్థిరంగా ఉంది. 24 క్యారెట్ల బంగారం కూడా స్థిరంగా ఉంది. ఒక గ్రాము బంగారం 24 క్యారెట్లకు ఇవాళ రూ.5198 గా ఉంది. 10 గ్రాముల బంగారం ధర రూ.51,980 గా ఉంది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

చెన్నైలో 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లకు రూ.47,700 కాగా.. 24 క్యారెట్లకు రూ.52,030 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,980 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,980 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,980 గా ఉంది. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,980 గా ఉంది.

ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.60 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 30 పైసలు తగ్గింది. 10 గ్రాముల వెండి ధర రూ.600 కాగా.. నిన్నటి ధరతో పోల్చితే రూ.3 తగ్గింది. కిలో వెండి ధర రూ.60,000 కాగా.. నిన్నటి ధరతో పోల్చితే 300 తగ్గింది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.656 కాగా.. కిలో వెండి ధర రూ.65600 గా ఉంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది