Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : ఓవైపు బంగారానికి పెరుగుతున్న డిమాండ్.. మరోవైపు అంతర్జాతీయ పరిస్థితులు.. బంగారం ధరను రోజురోజుకూ పెంచేస్తున్నాయి. పెట్రోల్ ధరలు పెరిగినట్టుగా బంగారం ధరలు కూడా విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. బంగారం ముడి సరుకు ధరలు పెరగడంతో పాటు.. బంగారం వినియోగం కూడా ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగింది. దాని కారణం వల్ల.. బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. బంగారం మాత్రమే కాదు.. వెండిని కూడా […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :29 May 2022,9:00 am

Today Gold Rates : ఓవైపు బంగారానికి పెరుగుతున్న డిమాండ్.. మరోవైపు అంతర్జాతీయ పరిస్థితులు.. బంగారం ధరను రోజురోజుకూ పెంచేస్తున్నాయి. పెట్రోల్ ధరలు పెరిగినట్టుగా బంగారం ధరలు కూడా విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. బంగారం ముడి సరుకు ధరలు పెరగడంతో పాటు.. బంగారం వినియోగం కూడా ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగింది. దాని కారణం వల్ల.. బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. బంగారం మాత్రమే కాదు.. వెండిని కూడా కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి. తులం బంగారం కొనాలంటే 50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మధ్య బంగారం ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. కొన్ని రోజులు తగ్గాయి. మూడునాలుగు రోజుల పాటు వరుసగా పెరుగుతూ వచ్చాయి. తాజాగా.. ఇవాళ బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.

08 May 2022 today gold Rates in Telugu states

దేశ వ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. 22 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు ఇవాళ రూ.4775 గా ఉంది. 10 గ్రాములకు రూ.47750 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు రూ.5209 గా ఉంది. 10 గ్రాముల బంగారం ధర రూ.52090 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ధరలు స్థిరంగా ఉన్నాయి. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,800 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.52,150 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం రూ.47,750 కాగా.. 24 క్యారెట్ల బంగారం రూ.52,090 గా ఉంది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూస్తే.. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం రూ.47,750 కాగా.. 24 క్యారెట్ల బంగారం రూ.52,090 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం రూ.47,750 కాగా.. 24 క్యారెట్ల బంగారం రూ.52,090 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం రూ.47,750 కాగా.. 24 క్యారెట్ల బంగారం రూ.52,090 గా ఉంది.

ఇక.. వెండి ధరలు చూసుకుంటే.. ఒక గ్రాము వెండి ధర రూ.62.20 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే వెండి ధర స్థిరంగా ఉంది. 10 గ్రాముల వెండి ధర రూ.622 గా ఉంది. కిలో వెండి ధర రూ.62,200 గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల వెండి ధర రూ.670 కాగా.. కిలో వెండి ధర రూ.67000 గా ఉంది.

ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.622 కాగా.. కిలో వెండి ధర రూ.62200 గా ఉంది. బెంగళూరు, హైదరాబాద్ లో 10 గ్రాముల వెండి ధర రూ.670 కాగా.. కిలో వెండి ధర రూ.67000గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలోనూ అదే ధర ఉంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది