Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం.. తగ్గిన వెండి ధరలు.. ఎంతో తెలుసా?
Today Gold Rates : ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. బంగారం కంటే విలువైన వస్తువులు ఎన్నో ఉన్నాయి. కానీ.. బంగారానికి ఉన్న డిమాండే వేరు. బంగారాన్ని ఎక్కువగా ఆభరణాలుగా చేసుకొని మెడలో వేసుకోవడానికి మహిళలు ఇష్టపడతారు. మహిళలకు బంగారం అంటే పిచ్చి ప్రేమ. అదే.. దానికి ఎక్కువ డిమాండ్ వచ్చేలా చేసింది. పెళ్లి అయినా.. బారసాల అయినా.. పెద్దమనిషి ఫంక్షన్ అయినా ఇంట్లో ఏ శుభకార్యం అయినా అక్కడ ఎక్కువగా మాట్లాడుకునేది బంగారం […]
Today Gold Rates : ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. బంగారం కంటే విలువైన వస్తువులు ఎన్నో ఉన్నాయి. కానీ.. బంగారానికి ఉన్న డిమాండే వేరు. బంగారాన్ని ఎక్కువగా ఆభరణాలుగా చేసుకొని మెడలో వేసుకోవడానికి మహిళలు ఇష్టపడతారు. మహిళలకు బంగారం అంటే పిచ్చి ప్రేమ. అదే.. దానికి ఎక్కువ డిమాండ్ వచ్చేలా చేసింది. పెళ్లి అయినా.. బారసాల అయినా.. పెద్దమనిషి ఫంక్షన్ అయినా ఇంట్లో ఏ శుభకార్యం అయినా అక్కడ ఎక్కువగా మాట్లాడుకునేది బంగారం గురించే. మహిళలు ఏ శుభకార్యానికి వెళ్లినా.. మెడలో బంగారం వేసుకోకుండా మాత్రం వెళ్లరు. ఒకప్పుడు బంగారానికి ఇంత డిమాండ్ లేదు.. అంత కాస్ట్ లీ కూడా కాదు. కానీ.. ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. కొన్ని రోజులు స్వల్పంగా తగ్గినా.. మళ్లీ పెరుగుతూనే ఉన్నాయి. మొన్న బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. కానీ.. నిన్న బంగారం, వెండి ధరలు రెండూ పెరిగాయి. ఇవాళ బంగారం ధర పెరగగా.. వెండి ధరలు తగ్గాయి.
ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4800 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.15 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.48000 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.150 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.5234 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.14 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.52,340 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.140 పెరిగింది.
Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
చెన్నైలో 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లకు రూ.47,920 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,280 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 48,000 కాగా.. 24 క్యారెట్ల బంగారం రూ.52,340 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.48,100 కాగా.. 24 క్యారెట్ల బంగారం రూ.52,400 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం రూ.48,000 కాగా.. 24 క్యారెట్ల బంగారం రూ.52,340 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం రూ.48,050 కాగా.. 24 క్యారెట్ల బంగారం రూ.52,420 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో చూస్తే 22 క్యారెట్ల బంగారం హైదరాబాద్ లో రూ.48,000 కాగా.. 24 క్యారెట్ల బంగారం రూ.52,340 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం రూ.48,000 కాగా.. 24 క్యారెట్ల బంగారం రూ.52,340 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం రూ.48,000 కాగా.. 24 క్యారెట్ల బంగారం రూ.52,340 గా ఉంది.
ఇక.. వెండి ధరలు చూస్తే.. ఒక గ్రాము వెండి ధర రూ.57.80 గా ఉంది. ఒక గ్రాముకు రూ.1.20 తగ్గింది. 10 గ్రాముల వెండి ధర రూ.578 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.12 తగ్గింది. కిలో వెండి ధర రూ.57,800 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.1200 తగ్గింది.
చెన్నైలో 10 గ్రాముల వెండి ధర రూ.635 కాగా.. కిలో వెండి ధర రూ.63500 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.578 కాగా.. కిలో వెండి ధర రూ.57800 గా ఉంది. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.635 కాగా.. కిలో వెండి ధర రూ.63500 గా ఉంది.