Sleep : నిద్ర కూడా లివర్ ను దెబ్బతీస్తుంది అంటే నమ్ముతారా… అవునండి ఇది నిజం… పరిశోధనలో తేలిన షాకింగ్ విషయాలు ఏమిటంటే…?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sleep : నిద్ర కూడా లివర్ ను దెబ్బతీస్తుంది అంటే నమ్ముతారా… అవునండి ఇది నిజం… పరిశోధనలో తేలిన షాకింగ్ విషయాలు ఏమిటంటే…??

 Authored By ramu | The Telugu News | Updated on :21 September 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Sleep : నిద్ర కూడా లివర్ ను దెబ్బతీస్తుంది అంటే నమ్ముతారా... అవునండి ఇది నిజం... పరిశోధనలో తేలిన షాకింగ్ విషయాలు ఏమిటంటే...??

Sleep : మనిషిని ఆరోగ్యంగా ఉంచటంలో లివర్ కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే లివర్ అనేది బాగుంటేనే మనం కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటాము. అయితే కొన్ని రకాల జీవన శైలి తప్పుల కారణం చేత లివర్ పనితీరు అనేది దెబ్బతింటుంది. ముఖ్యంగా చెప్పాలంటే మద్యం సేవించే వారిలో లివర్ ఎక్కువగా దెబ్బతింటుంది అనే సంగతి మనకు తెలిసిందే. అయితే నిద్రలేమి కూడా లివర్ ఆరోగ్యాని దెబ్బతిస్తుంది అని మీకు తెలుసా. అవును ఇది నిజం. నిద్రలేమి సమస్య అనేది లివర్ సిర్రోసిస్ వ్యాధికి దారి తీస్తుంది అని నిపుణులు అంటున్నారు. చైనాలోని హువాజోంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నిర్వహించినటువంటి పరిశోధనలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

అయితే నాన్ ఆల్కహాలిక్ లివర్ ఫ్యాటీ డిసీజ్ మరియు నిద్రకు మధ్య సంబంధం ఉన్నట్లుగా వారు కనుక్కున్నారు. అయితే పరిశోధన ప్రకారం చూస్తే, ఎంతో ఆరోగ్యకరమైన నిద్ర విధానాలు మరియు ఆల్కహాలిక్ లేని కొవ్వు లివర్ రోగులలో సిర్రోసిస్ సమస్య లేదని నిపుణులు కనుక్కున్నారు. అయితే ప్రస్తుతం పరిశోధన ప్రకారం దాదాపు 112, 196 నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధిగ్రస్తుల్లో నిద్రలేమి సమస్య ఉన్నట్లుగా వారు కనుక్కున్నారు. అయితే ఇది సిర్రోసిస్ సమస్యకు ముఖ్య కారణం అని అంటున్నారు. అలాగే దీర్ఘకాలంగా నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడే వారిలో కూడా సోర్రోసిస్ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు నిపుణులు. దీంతో లివర్ పై క్రమంగా మచ్చ కణజాలం అనేది వస్తుంది. అయితే ఈ గుర్తులు అనేవి లివర్ పనితీరుపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ పరిస్థితులు గనుక చాలా కాలం పాటుగా ఇలాగే కొనసాగుతూ ఉంటే లివర్ విఫలమయ్యే ప్రమాదాలు కూడా పెరుగుతాయి. అయితే లివర్ సిర్రోసిస్ కారణం చేత లివర్ లోని ఎంతో ఆరోగ్యకరమైన కణజాలాలు అనేవి నాశనం అవుతాయి. అయితే కొద్దిగా ముందస్తు లక్షణాల ఆధారంగా ఈ వ్యాధిని గుర్తించవచ్చు అని అంటున్నారు. అయితే అవి ఏమిటో చూద్దాం…

Sleep నిద్ర కూడా లివర్ ను దెబ్బతీస్తుంది అంటే నమ్ముతారా అవునండి ఇది నిజం పరిశోధనలో తేలిన షాకింగ్ విషయాలు ఏమిటంటే

Sleep : నిద్ర కూడా లివర్ ను దెబ్బతీస్తుంది అంటే నమ్ముతారా… అవునండి ఇది నిజం… పరిశోధనలో తేలిన షాకింగ్ విషయాలు ఏమిటంటే…??

ప్రతిరోజు వాంతులు మరియు వికారంగా ఉండడం. ఎటువంటి కారణాలు లేకుండా ఆకలి అనేది తగ్గడం. అలాగే చిన్న చిన్న పనులకే అలిసిపోవడం. అంతేకాక కామెర్లు రావడం మరియు బరువు తగ్గడం, చర్మంపై దురద లాంటివి ఏర్పడడం. అలాగే మూత్రం అనేది ముదురు రంగులో రావడం మరియు జుట్టు రాలడం, ముక్కు నుండి రక్తం కారడం, కండరాల తిమ్మిరి, ప్రతిరోజు జ్వరం రావడం. అంతేకాక జ్ఞాపక శక్తి తగ్గటం లాంటి లక్షణాలు సిరోసిస్ వ్యాధికి ముఖ్య లక్షణాలు అని అంటున్నారు నిపుణులు..

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది