Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. బంగారం కంటే విలువైన వస్తువులు ఎన్నో ఉన్నాయి. కానీ.. బంగారానికి ఉన్న డిమాండే వేరు. బంగారాన్ని ఎక్కువగా ఆభరణాలుగా చేసుకొని మెడలో వేసుకోవడానికి మహిళలు ఇష్టపడతారు. మహిళలకు బంగారం అంటే పిచ్చి ప్రేమ. అదే.. దానికి ఎక్కువ డిమాండ్ వచ్చేలా చేసింది. పెళ్లి అయినా.. బారసాల అయినా.. పెద్దమనిషి ఫంక్షన్ అయినా ఇంట్లో ఏ శుభకార్యం అయినా అక్కడ ఎక్కువగా మాట్లాడుకునేది బంగారం […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :30 June 2022,9:00 am

Today Gold Rates : ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. బంగారం కంటే విలువైన వస్తువులు ఎన్నో ఉన్నాయి. కానీ.. బంగారానికి ఉన్న డిమాండే వేరు. బంగారాన్ని ఎక్కువగా ఆభరణాలుగా చేసుకొని మెడలో వేసుకోవడానికి మహిళలు ఇష్టపడతారు. మహిళలకు బంగారం అంటే పిచ్చి ప్రేమ. అదే.. దానికి ఎక్కువ డిమాండ్ వచ్చేలా చేసింది. పెళ్లి అయినా.. బారసాల అయినా.. పెద్దమనిషి ఫంక్షన్ అయినా ఇంట్లో ఏ శుభకార్యం అయినా అక్కడ ఎక్కువగా మాట్లాడుకునేది బంగారం గురించే. మహిళలు ఏ శుభకార్యానికి వెళ్లినా.. మెడలో బంగారం వేసుకోకుండా మాత్రం వెళ్లరు. ఒకప్పుడు బంగారానికి ఇంత డిమాండ్ లేదు.. అంత కాస్ట్ లీ కూడా కాదు. కానీ.. ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. కొన్ని రోజులు స్వల్పంగా తగ్గినా.. మళ్లీ పెరుగుతూనే ఉన్నాయి. మొన్న బంగారం, వెండి రెండు ధరలు పెరిగాయి. నిన్న బంగారం ధరలు స్థిరంగా ఉండగా.. వెండి ధరలు తగ్గాయి. ఇవాళ బంగారం, వెండి ధరలు రెండూ తగ్గాయి.

08 May 2022 today gold Rates in Telugu states

ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4675 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.90 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.46,750 కాగా.. నిన్నటి ధరతో పోల్చితే రూ.900 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.5100 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.98 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.51,000 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.980 తగ్గింది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,830 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,090 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000 గా ఉంది. ఢిల్లీ, కోల్ కతాలో కూడా అదే ధర ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,770 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,020 గా ఉంది.

ఇక.. తెలుగు రాష్ట్రాల్లో చూస్తే.. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000 గా ఉంది.

ఇక.. వెండి దరలు చూసుకుంటే.. దేశ వ్యాప్తంగా ఇవాళ వెండి ధరలు తగ్గాయి. ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.59.40 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 60 పైసలు తగ్గింది. 10 గ్రాముల వెండి ధర రూ.594 కాగా.. నిన్నటి ధరతో పోల్చితే రూ.6 తగ్గింది. కిలో వెండి దర రూ.59,400 కాగా.. నిన్నటి ధరతో పోల్చితే రూ.600 తగ్గింది.

చెన్నైలో 10 గ్రాముల వెండి ధర రూ.653 కాగా.. కిలో వెండి ధర రూ.65300 గా ఉంది. ముంబై, ఢిల్లీలో 10 గ్రాముల వెండి ధర రూ.594 కాగా.. కిలో వెండి ధర రూ.59400 గా ఉంది. కోల్ కతా, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.653 కాగా.. కిలో వెండి ధర రూ.65300 గా ఉంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది