Blood Donate : 35 సార్లు రక్తదానం చేసి ఆదర్శంగా నిలుస్తున్న యువకుడు ..!!
Blood Donate : మనదేశంలో 37% మంది రక్తం దానం చేయడానికి అర్హులు. కానీ అందులో 10% మందే రక్తదానం చేస్తున్నారు. రక్తదానం చేయడం అంటే ఓ మనిషికి ప్రాణదానం చేసినట్లే. కానీ చాలామంది రక్తదానం చేయడం వలన బలహీనతకు దారితీస్తుందని అనుకుంటారు కానీ ఇందులో ఎంత మాత్రం నిజం లేదు. రక్తదానం చేయడం వలన ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది. అలాగే ఓ మనిషికి ప్రాణం పోసినట్లు కూడా అవుతుంది. రక్తదానం అనేది మనందరి సమాజ బాధ్యత. కొన్నిసార్లు రక్తం దొరకక చాలామంది మరణిస్తున్నారు.
అయితే అనంతపురం జిల్లాకు చెందిన పవన్ కుమార్ అనే వ్యక్తి 35 సార్లు రక్తదానం చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. పవన్ విద్యార్థి దశనుంచే బ్లడ్ డొనేట్ చేయడం మొదలుపెట్టారు. పవన్ కుమార్ మాట్లాడుతూ .. ఒకసారి ఆసుపత్రిలో ఒక గర్భిణీ మహిళ మృతి చెందారు. అప్పట్లో నాకు బ్లడ్ గ్రూప్స్, డొనేట్ చేయడం గురించి అవగాహన లేదు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఆ మహిళకు ఆ బ్లడ్ గ్రూప్ దొరికి ఉంటే బ్రతికేది అని అనుకోవడం విన్నాను. ఇక అప్పుడే నిర్ణయించుకున్నాను. బ్లడ్ క్యాంప్ ఏర్పాటుచేసి అందరికీ బ్లడ్ డొనేట్ చేయాలని డిసైడ్ అయ్యాను.
పదిమంది స్నేహితులతో కలిసి శాంతి సేవ రక్త సహకార బంధువు అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టాను. మా క్యాంపు నుంచి దాదాపుగా 15000 మందికి పైగా రక్తదానం చేసాము. 23 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలాగా తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాం. ప్రతి ఒక్కరికి రక్తదానం గురించి అవగాహన కల్పిస్తున్నాం అని చెప్పుకొచ్చారు. ఇలా ఎంతోమంది ప్రాణాలను కాపాడిన పవన్ కుమార్ ప్రజల నుంచి ప్రశంసలు అందుకున్నారు. అలాగే ఎన్నో బహుమతులను కూడా అందుకున్నారు. ఇతడిని చూసి యువత మార్పు చెందాలి. రక్తదానం చేయడం వలన మరొక ప్రాణం కాపాడినట్లే అవుతుంది కాబట్టి రక్తదానం చేయండి ప్రాణదాత అవ్వండి.
https://youtu.be/b6WFipEW6bQ