Today Gold Rates : మహిళలకు మరోసారి షాకిచ్చిన పసిడి, వెండి ధరలు.. ఎంత పెరిగిందో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మహిళలకు మరోసారి షాకిచ్చిన పసిడి, వెండి ధరలు.. ఎంత పెరిగిందో తెలుసా?

Today Gold Rates : ఈరోజుల్లో బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. తులం బంగారం కొనాలంటే 50 వేలకు పైగా వెచ్చించాలి. ఒకప్పుడు బంగారం కొనాలంటే పెద్దగా ఆలోచించేవారు కాదు జనాలు. పేద, మధ్య తరగతి ప్రజలు కూడా శుభకార్యాలకు అంతో ఇంతో బంగారాన్ని కొనుక్కునే వారు. కానీ.. పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అంతర్జాతీయ పరిస్థితులు ఒక కారణం అయితే.. బంగారానికి పెరుగుతున్న డిమాండ్ మరో కారణం. పెట్రోలు ధరలు ఎలా […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :4 June 2022,9:00 am

Today Gold Rates : ఈరోజుల్లో బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. తులం బంగారం కొనాలంటే 50 వేలకు పైగా వెచ్చించాలి. ఒకప్పుడు బంగారం కొనాలంటే పెద్దగా ఆలోచించేవారు కాదు జనాలు. పేద, మధ్య తరగతి ప్రజలు కూడా శుభకార్యాలకు అంతో ఇంతో బంగారాన్ని కొనుక్కునే వారు. కానీ.. పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అంతర్జాతీయ పరిస్థితులు ఒక కారణం అయితే.. బంగారానికి పెరుగుతున్న డిమాండ్ మరో కారణం. పెట్రోలు ధరలు ఎలా అయితే పెరుగుతూ పోతున్నాయో.. బంగారం ధరలు కూడా విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతూ పోతున్నాయి. గత కొన్నిరోజుల నుంచి వరుసగా పెరుగుతూ వెళ్తున్న బంగారం, వెండి ధరలు కొన్ని రోజులు ప్రజలకు కాస్త ఊరటనిచ్చాయి. ఆ తర్వాత బంగారం ధరలు వరుసగా పెరుగుతూ వెళ్తున్నాయి. తాజాగా ఇవాళ కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి.

08 May 2022 today gold Rates in Telugu states

దేశంలో ఇవాళ 22 క్యారెట్ల బంగారం ఒక గ్రాము ధర రూ.4810 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.50 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.48,100 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.500 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు ఇవాళ రూ.5247 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.54 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.52,470 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.540 పెరిగింది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,200 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,580 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,100 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,470 గా ఉంది. ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరులోనూ అదే ధర ఉంది.

Today Gold Rates : ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే.. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,100 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,470 గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలో కూడా 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,100 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,470 గా ఉంది.

ఇక.. వెండి ధరలు చూసుకుంటే.. ఒక గ్రాము వెండి ధర రూ.62,70 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.1.30 పెరిగింది. 10 గ్రాముల వెండి ధర రూ.627 కాగా.. నిన్నటి ధరతో పోల్చితే రూ.13 పెరిగింది. కిలో వెండి ధర రూ.62,700 కాగా.. నిన్నటి ధరతో పోల్చితే రూ.1300 పెరిగింది.

చెన్నైలో 10 గ్రాముల వెండి ధర రూ.685 కాగా.. కిలో వెండి ధర రూ.68500 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.627 కాగా.. కిలో వెండి ధర రూ.62700 గా ఉంది. హైదరాబాద్ లో 10 గ్రాముల వెండి ధర రూ.685 కాగా.. కిలో వెండి ధర రూ.68500 గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలోనూ అదే ధర ఉంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది