Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?
Today Gold Rates : ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అంతర్జాతీయ పరిస్థితులు ఒక కారణం అయితే.. బంగారానికి పెరుగుతున్న డిమాండ్ మరో కారణం. పెట్రోలు ధరలు ఎలా అయితే పెరుగుతూ పోతున్నాయో.. బంగారం ధరలు కూడా విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతూ పోతున్నాయి. తులం బంగారం కొనాలంటే.. 50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి నేడు నెలకొన్నది. అందుకే.. పేద, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనాలంటేనే […]
Today Gold Rates : ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అంతర్జాతీయ పరిస్థితులు ఒక కారణం అయితే.. బంగారానికి పెరుగుతున్న డిమాండ్ మరో కారణం. పెట్రోలు ధరలు ఎలా అయితే పెరుగుతూ పోతున్నాయో.. బంగారం ధరలు కూడా విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతూ పోతున్నాయి. తులం బంగారం కొనాలంటే.. 50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి నేడు నెలకొన్నది. అందుకే.. పేద, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనాలంటేనే దడుసుకుంటున్నారు. దాని జోలికే పోవడం లేదు. గత కొన్ని రోజుల నుంచి వరుసగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ వెళ్లాయి. మొన్న బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. కానీ.. నిన్న బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఇవాళ మళ్లీ పసిడి ధరలు తగ్గాయి.
ఇవాళ 22 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు రూ.4760 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.25 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర ఇవాళ రూ.47,600 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.250 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.5193 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.27 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.51930 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.270 తగ్గింది.
Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,720 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,060 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో రూ.47,600 కాగా.. 24 క్యారెట్ల బంగారం రూ.51,930 గా ఉంది. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలోనూ 22 క్యారెట్లకు రూ.47,600 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,930 గా ఉంది.
ఇక వెండి ధరలు చూసుకుంటే.. ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.61.90 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 50 పైసలు తగ్గింది. 10 గ్రాముల వెండి ధర రూ.619 కాగా.. నిన్నటి ధరతో పోల్చితే రూ.5 తగ్గింది. కిలో వెండి ధర రూ.61,900 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.500 తగ్గింది.
చెన్నైలో 10 గ్రాముల వెండి ధర రూ.677 కాగా.. కిలో వెండి ధర రూ.67700 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.619 కాగా.. కిలో వెండి ధర రూ.61900గా ఉంది. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.677 కాగా.. కిలో వెండి ధర రూ.67700 గా ఉంది.