Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. మరోసారి షాకిచ్చిన పసిడి, వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. మరోసారి షాకిచ్చిన పసిడి, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అంతర్జాతీయ పరిస్థితులు ఒక కారణం అయితే.. బంగారానికి పెరుగుతున్న డిమాండ్ మరో కారణం. పెట్రోలు ధరలు ఎలా అయితే పెరుగుతూ పోతున్నాయో.. బంగారం ధరలు కూడా విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతూ పోతున్నాయి. తులం బంగారం కొనాలంటే.. 50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి నేడు నెలకొన్నది. అందుకే.. పేద, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనాలంటేనే […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :9 June 2022,9:00 am

Today Gold Rates : ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అంతర్జాతీయ పరిస్థితులు ఒక కారణం అయితే.. బంగారానికి పెరుగుతున్న డిమాండ్ మరో కారణం. పెట్రోలు ధరలు ఎలా అయితే పెరుగుతూ పోతున్నాయో.. బంగారం ధరలు కూడా విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతూ పోతున్నాయి. తులం బంగారం కొనాలంటే.. 50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి నేడు నెలకొన్నది. అందుకే.. పేద, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనాలంటేనే దడుసుకుంటున్నారు. దాని జోలికే పోవడం లేదు. గత కొన్ని రోజుల నుంచి వరుసగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ వెళ్లాయి. మొన్న బంగారం, వెండి ధరలు పెరిగాయి. నిన్న మళ్లీ పసిడి ధరలు తగ్గాయి. ఇవాళ మళ్లీ బంగారం, వెండి ధరలు షాకిచ్చాయి.

24 april 2022 today gold rates in telugu states

ఇవాళ ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు రూ.4770 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.10 పెరిగింది. 10 గ్రాములకు ఇవాళ రూ.47,700 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.100 పెరిగింది. 24 క్యారెట్ల  బంగారం ఒక గ్రాముకు రూ.5204 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.11 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.52,040 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.110 గా ఉంది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,760 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,100 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,700 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,040 గా ఉంది. ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,700 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,040 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో చూస్తే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,700 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,040 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,700 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,040 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,700 కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,040 గా ఉంది.

ఇక.. వెండి ధరలు చూసుకుంటే.. ఒక గ్రాము వెండి ధర రూ.62.10 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 20 పైసలు పెరిగింది. 10 గ్రాముల వెండి ధర రూ.621 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.2 పెరిగింది. కిలో వెండి ధర రూ.62,100 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.200 పెరిగింది.

చెన్నైలో 10 గ్రాముల వెండి ధర రూ.680 కాగా.. కిలో వెండి ధర రూ.68000 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.621 కాగా.. కిలో వెండి ధర రూ.62100 గా ఉంది. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.680 కాగా… కిలో వెండి ధర రూ.68000 గా ఉంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది