Youtube : ఇలా చేస్తే యూట్యూబ్ యాడ్స్ బెడద ఉండదిక.. అది కూడా వీళ్లకు మాత్రమే..
Youtube : వీడియో ప్లాట్‌ఫాం యూట్యూబ్ గురించి తెలియని వారు ఉండరు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతిఒక్కరూ యూట్యూబ్ ని వాడతుంటారు. గూగుల్ తర్వాత అంత ఆదరణ పొందింది యూట్యూబ్. ఇందులో డైలీ కొన్ని లక్షల వీడియోలు అప్ లోడ్ చేస్తుంటారు. కోట్లాది మంది యూట్యూడ్ సబ్ స్క్రైబర్లు ఉంటారు. కాళీగా ఉంటే చాలు యూట్యూబ్ ఓపెన్ చేసి నచ్చిన వీడియోలు చూసి టైంపాస్ చేస్తుంటారు. అలాగే ఎంతో విలువైన సమాచారం కూడా యూట్యూబ్ ద్వారా పొందవచ్చు. యూట్యూబ్ లో వీడియోస్ చూసి చాలా మంది చాలా విషయాలు నేర్చుకుంటారు.
ఇందులో ఒక వీడియో చూసి బయటకు రావడం అంత తేలికకాదు. ఒకటి క్లిక్ చేయగానే దానికి సంబంధించిన ఎన్నో వీడియోలు ప్రత్యక్షం అవుతాయి.మనకు ఎలాంటి సమాచారం కావాలన్నా గూగుల్ తర్వాత సెర్చ్ చేసేది యూట్యూబ్ లోనే. ఎన్నో సాఫ్ట్ వేర్ లను ఎలా ఇన్ స్టాల్ చేయాలో కూడా యూట్యూబ్ లో వీడియోల రూపంలో లభ్యం అవుతుంటాయి. యూట్యూబ్ ద్వారా ఎంతో మంది సంపాదన పొందుతున్నారు. వీడియోలు, షార్ట్ ఫిలింమ్స్, షోలు, ఫన్నీ, వంటలు, డ్యాన్స్ వీడియోలు ఇలా కొన్ని లక్షల రకాల వీడియోలే లభ్యం అవుతుంటాయి.అయితే ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో యాడ్స్ గోల బాగా ఎక్కువైంది.
ఏ వీడియో చూడాలన్నా యాడ్స్ వస్తుంటాయి.. పోనీ సరేలే అని 5 సెకన్స్ తర్వాత స్కిప్ చేద్దామంటే ఆ ఆప్షన్ కూడా లేని యాడ్స్ వస్తున్నాయి. చేసేదేమిలేక ఆది అయిపోయేవరకు వేయిట్ చేయాల్సి వస్తోంది. అయితే ఈ యాడ్స్ నుంచి తప్పించుకోవడానికి యూట్యూబ్ సంస్థ ప్రీమియం ప్లాన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. నెలవారీగా రూ. 129 తో మొదలవుతోంది. ఈ సబ్ స్క్రిప్షన్ తీసుకుంటే యాడ్స్ గోల ఉండదు. ఇలా కాకుండా యాడ్ బ్లాకర్ వంటి థర్డ్ పార్టీ యాప్స్ తో కూడా యాడ్స్ నుంచి తప్పించుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్స్ ని డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకుంటే యాడ్స్ నుంచి విముక్తి లభిస్తుంది.