Ajwain | వాముతో ఆరోగ్య రహస్యాలు: జీర్ణ సమస్యల నుంచి బరువు తగ్గేవరకు అద్భుత ప్రయోజనాలు!
Ajwain | వాము గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రతి ఇంటి వంటల్లో తరచుగా వాడే ఈ విత్తనాలు రుచికోసం మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వాములో ఉన్న ఔషధ గుణాలు అనేక రకాల శరీర సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయి. ముఖ్యంగా జీర్ణ సమస్యలు, దగ్గు, కఫం, కొవ్వు వంటి సమస్యలపై ఇది అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
#image_title
జీర్ణ సమస్యలకు సహజ పరిష్కారం
వాములో ఉన్న నియాసిన్, థయామిన్, పొటాషియం, క్యాల్షియం, ప్రోటీన్, ఫైబర్ వంటి పోషకాలు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో వాము పౌడర్ కలిపి తాగితే, కడుపు ఉబ్బరం, త్రేన్పులు, జీర్ణ సమస్యలు దూరం అవుతాయి.
శ్వాసకోశ సమస్యలకు రక్షణ కవచం
వాములో ఉన్న యాంటీబాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు శ్వాసకోశ సంబంధిత వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. జలుబు, దగ్గు, కఫం వంటి సమస్యలతో బాధపడుతున్న వారు వాము నీరు తాగడం వల్ల ఉపశమనం పొందవచ్చు.
బరువు తగ్గించడంలో సహాయం
వాము నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. కప్పున్నర నీటిలో వాముని వేసి మరిగించి, అది కప్పు అయ్యే వరకు ఉంచి ఫిల్టర్ చేసుకుని తాగితే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
పంటి నొప్పి, నోటి దుర్వాసనకు పరిష్కారం
వామును మెత్తటి పౌడర్‌గా చేసి నిల్వ చేసుకోవచ్చు. పంటి నొప్పి ఉన్నవారు అర టీ స్పూన్ వాము పౌడర్, కొద్దిగా ఆలివ్ ఆయిల్, గోరువెచ్చని నీటితో కలిపి తాగితే, నొప్పి తగ్గుతుంది. అదనంగా, నోటి దుర్వాసన కూడా దూరమవుతుంది.