Samsung Galaxy F13 : సామ్ సంగ్ నుంచి మరో కొత్త ఫోన్ గెలాక్సీ ఎఫ్ 13… ఆటో డాటా స్విచింగ్ ఫీచర్ తో త్వరలో ఇండియాలోకి
Samsung Galaxy F13 : సౌత్ కొరియా ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ సామ్‌సంగ్ ఫోన్లకు ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. అందుకు అనుగుణంగానే సరికొత్త ఫీచర్స్ తో 5జీ ఫోన్లను బడ్జెట్ లో లాంచ్ చేస్తోంది. ప్రస్తుతం సామ్ సంగ్ గెలాక్సీ ఎఫ్ 13 మొబైల్ ను ఈ నెల 22న లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ ధర ఇరవై వేలలోపే ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫుల్ హెచ్ డీ+ఎల్ సీడీ 6.5 ఇంచెస్ డిస్ల్పే తో పాటు 5జీ నెట్ వర్క్ తో పనిచేయనుంది.
అయితే మొట్టమొదటి సారిగా ఆటో డాటా స్విచ్ ఫీచర్ తో ఈ మొబైల్ ని తీసుకొస్తున్నారు. 6000 ఎమ్ఏఎచ్ బ్యటరీ కెపాసిటీతో 15 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ తో అందుబాటులోకి రానుంది. అయితే ప్రాసెసర్ కి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియనప్పటికీ ఆండ్రాయిడ్ వీ11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడుస్తోందని అంచనా వేస్తున్నారు. అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ను అందిస్తున్న ఈ ఫోన్ లో 3.5 ఎంఎం ఎడ్ ఫోన్ జాక్, యూఎస్బీ సీ పోర్ట్ ఇచ్చారు.
ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పూర్తి వివరాలు తెలియకపోయినప్పటికీ కెమెరా స్పెసిఫికేషన్ల గురించి 48 ఎంపీ + 8 ఎంపీ + 2 ఎంపీ + 5 ఎంపీ ఉండవచ్చని భావిస్తున్నారు. బ్యాక్ కెమెరా సెటప్‌లోని ఫీచర్‌లలో డిజిటల్ జూమ్, ఆటో ఫ్లాష్, ఫేస్ డిటెక్షన్, ఫోకస్ చేయడానికి టచ్ వంటివి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం 8 ఎంపీ కెమెరాతో అందుబాటులోకి రానుందని సమాచారం.