ఆ జిల్లాల ఎమ్మెల్యేలతో సీఎం జ‌గ‌న్ అత్య‌వ‌స‌ర భేటీ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ఆ జిల్లాల ఎమ్మెల్యేలతో సీఎం జ‌గ‌న్ అత్య‌వ‌స‌ర భేటీ..!

 Authored By himanshi | The Telugu News | Updated on :21 April 2021,6:00 pm

Ys Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి మరోసారి కాదు మళ్లీ మళ్లీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకునేందుకు మంచి పనులు చేస్తున్నారు. ఆయన చేపట్టిన సంక్షేమ పథకాల కారణంగా ఇప్పటికే ఆయన్ను జనాలు నెత్తిన పెట్టుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి పార్టీకి దక్కిన సీట్లు ఓట్లను బట్టి ఆయన క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. సుదీర్ఘ కాలంగా ఏపీలో వెనుకబడి ఉన్న కొన్ని ప్రాంతాలపై ఇప్పుడు జగన్ దృష్టి పెట్టారు. ఎంతో మంది సీఎంలు వచ్చారు. కాని ఇప్పటి వరకు ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఆ ప్రాంతాల గురించి పట్టించుకున్నది లేదు. మొదటి సారి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి ఆ ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని నిర్ణయించుకున్నాడు.

YS Jagan : ఎమ్మెల్యేలతో భేటీ…

అభివృద్దికి ఆమడ దూరంలో ఉన్న ప్రాంతాల జాబితాను సిద్దం చేసిన ప్రభుత్వం త్వరలోనే అక్కడ అన్ని విధాలుగా అభివృద్దిని చేసేందుకు సిద్దం అయ్యింది. తాగేందుకు కనీసం తాగు నీరు కూడా లేని ప్రాంతాలు ఇంకా ఏపీలో ఉన్నాయని తెలిసి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి అవాక్కయ్యారట. సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి వెంటనే ఆ ప్రాంతాలకు సంబంధించిన ఎంపీలను మరియు ఎమ్మెల్యలను కలిసి ఏం చేయాలి అక్కడ ఏం జరగాలి అనే విషయమై చర్చించినట్లుగా తెలుస్తోంది. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరగాల్సిన సమయం వచ్చిందంటూ ఎమ్మెల్యేలు మరియు ఎంపీలతో సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారట.

AP CM YS Jagan meeting with mlas

AP CM YS Jagan meeting with mlas

YS Jagan : జిల్లాల వారిగా ఎమ్మెల్యేలతో..

ప్రతి జిల్లాలో కూడా ఏదో ఒక చోట అభివృద్దికి నోచుకోని ప్రాంతాలు ఉన్నాయి. కనుక ప్రతి నియోజక వర్గంలో కూడా అలాంటి ప్రాంతాలను గుర్తించాలంటూ జిల్లాల వారిగా ఎమ్మెల్యేల సమావేశంను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ఏర్పటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క నియోజక వర్గంలో కూడా వెనుకబాటు తనం అనేది ఉండకుండా చూడాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు. ప్రతి నియోజక వర్గంలో కూడా ఈ తరహాలో అభివృద్ది పనులు చేసినప్పుడే వచ్చే ఎన్నికల్లో ఆ తర్వాత ఎన్నికల్లో వైకాపా అధికారంలో ఉంటుందని సొంత పార్టీ ఎమ్మెల్యేలకు మరియు నాయకులకు సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి హితవు చెప్పారు.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది