సీఎం జగన్ పంపిన ఎమ్మెల్సీ జాబితాకు గవర్నర్ ఆమోదం
ap governor గవర్నర్ కోటాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన జాబితాను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ap governor ఆమోదముద్రవేశారు. గవర్నర్ కోటాలో మోషేన్ రాజా , లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, రమేష్ యాదవ్ ఎమ్మెల్సీలుగా ఏపీ ప్రభుత్వం గతవారం పంపింది. ఈ జాబితాను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ap governor ఆమోదం తెలిపారు. అయితే ఈ రోజు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గవర్నర్ తో 40 నిమిషాలు భేటి అయినారు.

ap governor approves four mlcs
ఆ భేటీ ముగిసిన కొద్ది సేపటికే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆ నాలుగురి పేర్లను ఆమోదం తెలిపారు.ఈ నెల 11వ తేదీన గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తైంది.టీడీపీకి చెందిన గౌనిగాని శ్రీనివాలు నాయుడు, పి. శమంతకమణి, టీడీ జనార్థన్, బీద రవిచంద్రయాదవ్‌ల పదవీకాలం ముగిసింది. అందులో ముగ్గురు టీడీపీలోనే ఉండాగా, పి. శమంతకమణి మాత్రం వైసీపీలో చేరింది. వీళ్ల పదవీకాలం ముగియడంతో కొత్త గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పేర్లను నామినేటేడ్ చేయాల్సి వచ్చింది.