Health Tips : ఈ రెండు పండ్లు కలిపి అస‌లు తినకూడదు.. ఆరోగ్య నిపుణుల హెచ్చరికలు ఇవే… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Tips : ఈ రెండు పండ్లు కలిపి అస‌లు తినకూడదు.. ఆరోగ్య నిపుణుల హెచ్చరికలు ఇవే…

 Authored By sandeep | The Telugu News | Updated on :23 August 2025,7:00 am

Health Tips :  పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయనడం నిజమే. కానీ కొన్ని పండ్లను కలిపి తినడం శరీరానికి హానికరంగా మారొచ్చు. ముఖ్యంగా అరటిపండు మరియు బొప్పాయి.. ఈ రెండు అత్యంత పోషకమైన పండ్లను కలిపి తినడం ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అరటిపండులో ఉండే పొటాషియం, కాల్షియం, ఫైబర్ శరీరానికి బలాన్ని ఇస్తాయి.

* శక్తినిస్తుంది
* గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
* జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
* ఎముకలను బలపరుస్తుంది

బొప్పాయి లాభాలు చూస్తే..

* జీర్ణక్రియ మెరుగవుతుంది
* చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది
* రోగనిరోధక శక్తి పెరుగుతుంది
* గుండెజబ్బుల ప్రమాదం తగ్గుతుంది
* కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది

అరటి – బొప్పాయి వేర్వేరు స్వభావాలు కలిగిన పండ్లు. అరటిపండు శరీరాన్ని చల్లబరిచే స్వభావం కలిగి ఉంటుంది. బొప్పాయి శరీరానికి వేడినిస్తుంది.

ఈ విభిన్న స్వభావాలు కలిపి తినడం వల్ల:

* జీర్ణవ్యవస్థపై ఒత్తిడి
* తలనొప్పి, వాంతులు, అజీర్ణం
* అలెర్జీలు, తలతిరుగుడు వంటి సమస్యలు వస్తాయన్నది ఆయుర్వేదం సూచన

* శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు బొప్పాయి తినకుండా ఉండటం మంచిది
* కామెర్లు ఉన్నవారికి బొప్పాయిలోని పపైన్, బీటా కెరోటిన్ హానికరం
* పొటాషియం ఎక్కువ ఉన్నవారు అరటిపండ్లను తక్కువగా తీసుకోవాలి

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది