Papaya | భోజనం తర్వాత బొప్పాయి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా… ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Papaya | భోజనం తర్వాత బొప్పాయి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా… ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

 Authored By sandeep | The Telugu News | Updated on :6 October 2025,10:00 am

Papaya | ఉదయం లేదా భోజనం తర్వాత బొప్పాయి తినడం శరీరానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలిపారు. ముఖ్యంగా భోజనం తర్వాత కొద్దిసేపటికే బొప్పాయి తీసుకుంటే జీర్ణక్రియ సక్రమంగా సాగుతుందని తెలిపారు.బొప్పాయిలో ఉన్న పపైన్ అనే ఎంజైమ్ ప్రోటీన్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఆహారం వేగంగా జీర్ణమై, కడుపు వేడి తగ్గి ఆమ్లత్వ సమస్యలు నిరోధిస్తుందన్నారు.

#image_title

అంతేకాదు, ఈ పండు ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం కలుగుతుందనే వివరాలు అందించారు. భోజనానికి ముందు బొప్పాయి తినడం వలన ఆకలి తగ్గి కడుపు నిండినట్టే అనిపించడమే కాకుండా, జీర్ణ సమస్యలు తగ్గుతాయని నిపుణులు తెలిపారు.

పరిమిత పరిమాణంలో ఉదయం బొప్పాయి తినాలి

అయితే, ఖాళీ కడుపులో బొప్పాయి ఎక్కువగా తినడం వల్ల కడుపుపై ఒత్తిడి ఏర్పడి జీర్ణ సమస్యలు మిగిలిపోవచ్చని సూచించారు. అలాగే, బొప్పాయికి అలెర్జీ ఉన్నవారు దానిని తినకూడదని హెచ్చరించారు.ప్రతి రాత్రి భోజనం తర్వాత బొప్పాయి తినడం వల్ల మలబద్ధకం సమస్యలు తగ్గి, ఉదయం తేలికగా కడుపు శుభ్రంగా ఉంటుందని నిపుణులు చెప్పడం జరిగింది. దీని లోని విటమిన్ C, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధులు రాకుండా చేస్తాయని చెప్పారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది