Ys Jagan : వైఎస్ జగన్ కి బీజేపీ ప్రయారిటీ… మోడీ ప్లాన్ ఇదే..?
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి Ys Jagan కి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. వైఎస్ జగన్ గతంలో హస్తినకు వెళితే పెద్దగా పట్టించుకోని కమలనాథులు మొన్న బాగా చూసుకున్నారని తెలుస్తోంది. సాక్షాత్తూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఏపీ సీఎం వైఎస్ జగన్ ని రాత్రి భోజనానికి పిలిచి మరీ మంతనాలు సాగించినట్లు సమాచారం. మిగతా మంత్రులు కూడా వైఎస్ జగన్ Ys Jagan కి ఎక్కువ సమయం కేటాయించారని చెబుతున్నారు. కాషాయ దళంలో ఈ మార్పు కొట్టొచ్చినట్లు కనిపించడానికి కారణం ఏమై ఉంటుందనే చర్చలు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి.
అవసరం పడితే తప్ప.. Ys Jagan
అవసరాన్ని బట్టి రాజకీయాల్లో సమీకరణలు వేగంగా మారతాయి. మోడీ ప్రభుత్వానికి కూడా వైఎస్ జగన్ Ys Jagan తో అవసరం ఉంది కాబట్టే మర్యాదలు చేస్తోంది. ఏంటా అవసరం అంటే రాష్ట్రపతి ఎన్నిక. ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం వచ్చే ఏడాది మే నెలతో పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో మరో మూడు నాలుగు నెలల్లో ఆ ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రపతిని ఎన్నుకోవటానికి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఓటు హక్కు ఉంటుంది. సౌత్ లో అత్యధిక సంఖ్యలో ఎలక్టోరల్ కాలేజీ కలిగిన పార్టీ వైఎస్సార్సీపీ. ఇటీవలి కాలంలో ఎన్డీఏని మిత్ర పక్షాలు వీడటం, కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోవటంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు కమలనాథులకు కావాల్సి వచ్చింది. అందుకే వైఎస్ జగన్ మొన్న ఢిల్లీకి వెళ్లినప్పుడు ధావత్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
కేబినెట్ లోకి.. Ys Jagan
వైఎస్సార్సీపీ నరేంద్ర మోడీ మంత్రివర్గంలో చేరనుందని కూడా లేటెస్టుగా ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీకి రెండు మంత్రి పదవులు ఇస్తారని, వాటిని స్వీకరించబోయేవాళ్ల పేర్లు విజయసాయిరెడ్డి, డాక్టర్ గురుమూర్తి అని కూడా అన్నారు. అందుకేనేమో వైఎస్ జగన్ Ys Jagan ఈసారి దేశ రాజధానిలో బిజీబిజీగా గడిపారని మీడియా కోడై కూస్తోంది. ఆ అంశం ఎటూ తేలకుండానే మళ్లీ ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక వ్యవహారాన్ని తెర మీదికి తెస్తున్నారు. ఏది నిజమో త్వరలో తేలనుంది. ఇదిలాఉండగా రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ నే మరోసారి కొనసాగించనున్నారని అంటున్నారు.
అంత అవసరం లేదు..
నిజం చెప్పాలంటే బీజేపీకి కేంద్రంలో మెజారిటీ బాగానే ఉంది. ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ రోజురోజుకీ బలహీనంగా మారుతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కమలం పార్టీ నిలబెట్టే ప్రెసిడెంట్ క్యాండేట్ రామ్ నాథ్ కోవింద్ తేలిగ్గానే ఒడ్డునపడతారు. కానీ మధ్యలో ప్రశాంత్ కిషోర్ ఎంటరై బీజేపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ని కూడా రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలపనున్నారని, ఈ మేరకు థర్డ్ ఫ్రంట్ ని ఏర్పాటుచేసేందుకు ప్రశాంత్ కిషోర్ ప్రయత్నాలు చేస్తున్నాడని పేర్కొంటున్నారు. అందుకే బీజేపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి Ys Jagan లాంటి వాళ్లను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయారిటీ ఇస్తోందని వివరిస్తున్నారు.