Chandra Mohan : చంద్రమోహన్ కుటుంబం గురించి ఎవరికీ తెలియని నిజాలు ..!
ప్రధానాంశాలు:
Chandra Mohan : చంద్రమోహన్ కుటుంబం గురించి ఎవరికీ తెలియని నిజాలు
టాలీవుడ్ ప్రముఖ నటుడు చంద్రమోహన్ మృతి
నటుడు చంద్రమోహన్ ఈరోజు ఉదయం 9:45 నిమిషాలకు కన్నుమూశారు
Chandra Mohan : టాలీవుడ్ ప్రముఖ నటుడు Chandra Mohan చంద్రమోహన్ ఈరోజు ఉదయం 9:45 నిమిషాలకు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన ఈరోజు హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 1945 మే 23న కృష్ణా జిల్లాలోని పమిడిముక్కల గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి వీరభద్ర శాస్త్రి , తల్లి శాంభవి. ఇక టాలీవుడ్ లో పేరు గాంచిన దర్శకులు కె.విశ్వనాథ్ గారికి చంద్రమోహన్ బంధువు అవుతారు.
అందుకే ఎక్కువగా చంద్రమోహన్ కే. విశ్వనాథ్ సినిమాలలో కనిపిస్తూ ఉంటారు. విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించిన ‘ శంకరాభరణం ‘ సినిమాలో చంద్రమోహన్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. అలాగే ‘ పదహారేళ్ళ వయసు ‘ సినిమాలో తన నటనకు ఫిలింఫేర్ అవార్డు కూడా దక్కింది. అలాగే మరో ప్రముఖ డైరెక్టర్ బాపుగారు కూడా చంద్రమోహన్ కి బంధువు అవుతారట. ఈయన సినిమాలలో కూడా చంద్రమోహన్ కనిపిస్తూ ఉంటారు. ఇక టాలీవుడ్ దివంగత స్టార్ హీరోలు అయిన సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు ఆయనకు అత్యంత సన్నిహితులు.
అప్పట్లో ఇండస్ట్రీలో చంద్రమోహన్ హీరోయిన్లకు లక్కీ అని అంటుండేవారు. ఈయనతో నటించిన జయసుధ, జయప్రద, శ్రీదేవి, రాధిక, రాధ, విజయశాంతి లాంటి ఎంతో మంది హీరోయిన్లు స్టార్లుగా రాణించారు. ఆయనతో తొలిసారిగా నటించిన ఏ హీరోయిన్ అయినా తర్వాత తిరుగులేని స్టార్ హీరోయిన్ అయిపోతారని సెంటిమెంట్ ఉండేది. ఆ సెంటిమెంట్ ను నిజం చేస్తూ ఎంతో మంది హీరోయిన్లు తిరుగులేని స్టార్ హీరోయిన్లు అయ్యారు. ఇక చంద్రమోహన్ మరణం పై టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. మంచి నటుడిని కోల్పోయామని బాధను వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.