Petrol : రాత్రి పూట పెట్రోల్ కొట్టిస్తే ఎక్కువ వస్తుందా? దానికి కారణం ఏంటి? అందుకే చాలామంది రాత్రిపూట పెట్రోల్ కొట్టిస్తారా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Petrol : రాత్రి పూట పెట్రోల్ కొట్టిస్తే ఎక్కువ వస్తుందా? దానికి కారణం ఏంటి? అందుకే చాలామంది రాత్రిపూట పెట్రోల్ కొట్టిస్తారా?

Petrol : పెట్రోల్ అనగానే మనకు గుర్తొచ్చేది.. ఇప్పుడు మండుతున్న పెట్రోల్ రేట్లు. అవును.. సెంచరీ దాటేసి లీటర్ పెట్రోల్ ధర ఆకాశాన్ని తాకుతోంది. 110 రూపాయలు పెడితే గానీ లీటర్ పెట్రోల్ దొరకడం లేదు. అందుకే.. 100 రూపాయల పెట్రోల్ కొట్టించినా కూడా పెట్రోల్ గన్ లోని పెట్రోల్ చుక్కలు మొత్తం ట్యాంక్ లో పడేంతవరకు దాన్ని అలాగే పెట్రోల్ ట్యంక్ లో ఉంచుతున్నాం. దానికి కారణం.. ప్రతి పెట్రోల్ చుక్క కూడా ముఖ్యమే కదా. […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :28 June 2022,5:30 pm

Petrol : పెట్రోల్ అనగానే మనకు గుర్తొచ్చేది.. ఇప్పుడు మండుతున్న పెట్రోల్ రేట్లు. అవును.. సెంచరీ దాటేసి లీటర్ పెట్రోల్ ధర ఆకాశాన్ని తాకుతోంది. 110 రూపాయలు పెడితే గానీ లీటర్ పెట్రోల్ దొరకడం లేదు. అందుకే.. 100 రూపాయల పెట్రోల్ కొట్టించినా కూడా పెట్రోల్ గన్ లోని పెట్రోల్ చుక్కలు మొత్తం ట్యాంక్ లో పడేంతవరకు దాన్ని అలాగే పెట్రోల్ ట్యంక్ లో ఉంచుతున్నాం. దానికి కారణం.. ప్రతి పెట్రోల్ చుక్క కూడా ముఖ్యమే కదా. సాధారణంగా మీరు ఏ సమయాల్లో పెట్రోల్ కొట్టిస్తారు. ఉదయమా.. మధ్యాహ్నమా.. లేక సాయంత్రమా? ఎందుకంటే.. ఏ సమయంలో పెట్రోల్ కొట్టిస్తే.. దాని ప్రకారం.. కొన్ని విషయాలు జరుగుతాయట. చాలా మంది పెట్రోల్ ను రాత్రి పూట కొట్టిస్తారు.

దానికి ప్రత్యేకంగా ఏదైనా కారణం ఉందా అంటే.. ఉంది. ఇంకొందరు ఉదయం 6 లోపే పెట్రోల్ కొట్టిస్తారు. అసలు.. రాత్రి, ఉదయం 6 లోపు పెట్రోల్ కొట్టించడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. అందరికీ తెలుసు.. పెట్రోల్ కు ఆవిరి అయ్యే గుణం ఉంటుందని. ఒక లీటర్ పెట్రోల్ తీసుకొచ్చి.. ఒక క్యాన్ లో పోసి.. మూత పెట్టకుండా అలాగే ఎండలో ఉంచితే… కేవలం 5 నిమిషాల్లో పెట్రోల్ మొత్తం ఆవిరి అయిపోతుంది. అవును.. ఒక్క చుక్క కూడా లేకుండా పెట్రోల్ మొత్తం ఆవిరి అవుతుంది. అది ఎలా సాధ్యం అవుతుంది అంటే.. దాని వెనుక ఉన్నది సూర్యరశ్మి. ఎండ వేడికి పెట్రోల్ ఏమాత్రం ఉండలేదు. దెబ్బకు ఆవిరి అవుతుంది.

do we get more petrol when we fill it during night time

do we get more petrol when we fill it during night time

Petrol : రాత్రి పూట పెట్రోల్ కొట్టించడం మంచిదా?

అదే సూత్రాన్ని పెట్రోల్ బంక్ లలోనూ వర్తింపజేస్తున్నారు. మధ్యాహ్నం పూట పెట్రోల్ కొట్టిస్తే.. ఎండ వేడికి కొంచెం తక్కువగా వస్తుందని.. కొంచెం ఆవిరి అవుతుందని.. అందుకే.. రాత్రి పూట కానీ.. లేదా ఉదయం 6 లోపు పెట్రోల్ కొట్టిస్తే పెట్రోల్ కు ఎండ వేడి తగలదు కాబట్టి.. లీటర్ కు ఇంకొంచెం ఎక్కువే వస్తుంది అంటూ కొందరు చెబుతున్నారు. కానీ.. ఈరోజుల్లో పెట్రోల్ బంక్ లలో పెట్రోల్, డీజిల్ ను అండర్ గ్రౌండ్ లో స్టోర్ చేస్తుంటారు. వాటి మీద పెద్ద పెద్ద కాంక్రీట్ లేయర్స్ ఉంటాయి. అవి ఇన్సులేటర్స్ గా పనిచేస్తాయి. కాబట్టి.. వాటి మీద ఎండ వేడి అస్సలు పడదు. కాబట్టి.. పెట్రోల్ ఆవిరి అయ్యే చాన్స్ ఉండదు. ఎండలో పెట్రోల్ కొట్టించినా.. రాత్రి కొట్టించినా చివరకు పెట్రోల్ లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. అది కేవలం అపోహ మాత్రమే అని మరికొందరు విశ్లేషకులు కొట్టి పారేస్తున్నారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది