కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..! రెడీ టు జంప్..?
komatireddy rajagopal reddy తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ కు అదే రాష్ట్రంలో రాకూడని కష్టం వచ్చింది. ఈ ఏడేళ్లలో కాంగ్రెస్ పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ప్రజలు ఓట్లు వేయలేదు.. పార్టీలో నాయకులు నిలబడటం లేదు. పాత నాయకత్వమే కొనసాగుతోంది. అందులోనూ చాలామంది పార్టీకి ఏనాడో గుడ్ బై చెప్పేశారు. మిగిలిన కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు మాత్రమే పార్టీ ఉనికి చాటుతున్నారు. భవిష్యత్ పార్టీ నాయకత్వానికి ఊపిరి ఉంటుందా అనే ప్రశ్నలే తలెత్తేలా రాష్ట్రంలో పార్టీ ఉందంటే అతిశయోక్తి కాదు. ఈక్రమంలో పార్టీకి మరో కీలక నేత గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదేం కొత్త విషయం కాకపోయినా.. కొన్నాళ్లుగా మరుగునపడి ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి వస్తోంది. ఆయనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
కాంగ్రెస్ లో బలమైన నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి komatireddy rajagopal reddy
తెలంగాణలో కాంగ్రెస్ కు ఉన్న బలమైన నాయకుల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి komatireddy rajagopal reddy ఒకరు. గతంలోనే పార్టీని వీడుతారన ప్రచారం జరిగింది. బీజేపీలో చేరుతున్నారనే సంకేతాలూ వచ్చాయి. ఆయనా దాన్ని ఖండించలేదు.
వెళ్తే తప్పేంటి.. అన్నట్టుగానే ఆయన వ్యాఖ్యలు ఉండేవి. కానీ.. కొన్నాళ్లుగా ఈ వార్తలు సైలెంట్ అయిపోయాయి. ఆయనా.. పార్టీ మారే సంకేతాలు ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు మాత్రం బీజేపీలోకి వెళ్లేందుకే నిర్ణయించుకున్నట్టు.. ఇందుకు తగిన సమయం కోసం వేచి చూస్తున్నట్టు తెలుస్తోంది. టీపీసీసీ అధ్యక్ష పదవి ఎవరికో తేలిపోతే.. రాజగోపాల్ రెడ్డి komatireddy rajagopal reddy పార్టీ మారడం లాంఛనమే అంటున్నారు. అయితే.. అధ్యక్ష పదవి సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి దక్కితే మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగే అవకాశం ఉందనే వార్తలూ లేకపోలేదు.
అయితే.. రాజగోపాల్ రెడ్డి పార్టీ మారేందుకు కారణాలు పార్టీ పరిస్థితులే కారణం అంటున్నారు. అధికార పార్టీపై సరైన వాయిస్ వినిపించేందుకు కూడా సరైన నాయకత్వం లేదని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ కు రాష్ట్రంలో భవిష్యత్ లేదనే ఆయన పార్టీ మార్పుకు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. 2018 తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో పెద్దగా కనిపించిందీ లేదు. పార్టీ తరపున వాయిస్ వినిపించిందీ లేదు. టీఆర్ఎస్ లోకి వెళ్తే జిల్లాలో తమకు దక్కు ప్రాధాన్యం లేదని గతంలోనే ఆలోచించి బీజేపీవైపు మొగ్గు చూపారు. మరి.. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.