Ratan Tata : దాతృత్వానికి మరో రూపం రతన్ టాటా.. ఆయన పట్టిందల్లా బంగారమే..!
ప్రధానాంశాలు:
Ratan Tata : దాతృత్వానికి మరో రూపం రతన్ టాటా.. ఆయన పట్టిందల్లా బంగారమే..!
Ratan Tata : రతన్ టాటా మంచి విజన్ ఉన్న వ్యాపార వేత్త. రతన్ టాటా అనేక విజయాలకు కేరాఫ్ అడ్రస్. ఏ రంగంలో అడుగుపెట్టినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఉద్యోగులను కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారు. ఇక సేవా గుణంలో ఆయనను మించిన వ్యాపారవేత్త లేడనే చెప్పుకొవచ్చు. సామాన్యుల కోసం ఆలోచించిన కోటీశ్వరుడిగా రతన్ టాటాకు పేరు ఉంది. భారత దేశ ప్రముఖ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందారు. 1990 నుండి 2012 వరకు టాటా గ్రూప్ కి చైర్మన్ గా ఉన్నారు. అక్టోబర్ 2016 నుండి ఫిబ్రవరి 2017 వరకు టాటా గ్రూప్ కు తాత్కాలిక ఛైర్మన్ గా వ్యవహరించారు. చనిపోయేంత వరకూ టాటా ఛారిటబుల్ ట్రస్టులకు అధిపతిగా రతన్ టాటా వ్యవహరించారు.
Ratan Tata విజన్ ఉన్న వ్యాపార వేత్త..
వ్యాపార రంగంలో సాహాసాలకు ఆయన మారుపేరుగా మారారు. రతన్ టాటా గురించి చెప్పడానికి ఎంతో ఉంది.వంటగదిలో ఉపయోగించే ఉప్పు నుంచి ఆకాశంలో ఎగిరే విమానాల వరకు రతన్ టాటా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. వ్యాపార రంగంలో సరికొత్త రికార్డులు నెలకొల్పడం ద్వారా టాటా గ్రూప్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళారు. దేశంలో టాటా కంపెనీ తొలిసారిగా చేపట్టిన ఉత్పత్తులను గురించి చెప్పాలంటే అనేకం ఉన్నాయి.దాతృత్వంలో రతన్‌ను మించిన వారు లేరు. వ్యాపారంలో డబ్బులు సంపాదించడమే టార్గెట్‌గా కాకుండా..నాణ్యమైన ఉత్పత్తులు, సేవలు అందిస్తూ దేశ ప్రజల గుండెల్లో చిరస్థానం సంపాదించుకున్నారు. పేదలకు కోట్ల రూపాయల దానం చేశారు ప్రపంచ వ్యాపార రంగంలో అత్యున్నత స్థాయిలను అందుకున్నారు.
కొత్తదనాన్ని, కొత్త తరాన్ని ప్రోత్సహించడంలో రతన్ ఎప్పుడూ ముందుడేవారు. ప్రపంచంలోని చౌకైన కారుని తీసుకొచ్చిన ఘనత రతన్ టాటాకే దక్కుతుంది. భారతదేశంలోని మిలియన్ల మంది ప్రజలకు మోటార్ సైకిళ్ళకు ప్రత్యామ్నాయంగా.. సరసమైన, సురక్షితమైన కార్‌ను అందించడంలో రతన్ సక్సెస్ అయ్యారు. కారు కొనుక్కోవాలనే ఎంతో మంది కలను సాకారం చేశారు. నష్టాల్లో ఉన్న బ్రిటన్ కంపెనీలు జాగ్వార్, లాండ్‌రోవర్‌లను కొని లాభాలబాటలోకి నడిపించిన నాయకుడు రతన్ టాటా. రూ లక్ష కే నానో కారును అందుబాటులోకి తెచ్చి అందరి ప్రశంసలు అందుకున్నారు. విలువలతో కూడిన వ్యాపారానికి చిరునామాగా నిలిచిన ఓ మహనీయుడు ఆయన. న ఆదాయంలో 60 నుంచి 65 శాతం మేర వివిధ దాతృత్వ కార్యక్రమాలకు కోసం ఉదారంగా ఇచ్చేసి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. భారత ప్రభుత్వం ఆయనను 2000 సంవత్సరంలో పద్మభూషణ్‌తో, 2008లో పద్మవిభూషణ్‌తో గౌరవించింది. ఆయన మృతిపై ప్రతి ఒక్కరు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.