Ratan Tata : దిగ్గజ పారిశ్రామిక వేత్త రతన్ టాటా కన్నుమూత.. ఆయన నికర ఆస్తి విలువ ఎంతో తెలుసా?
Ratan Tata : ప్రముఖ వ్యాపారవేత్త, టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా (86) వయోభారంతో కన్నుమూసారు. కొద్ది రోజులుగా ఆయన ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే బుధవారం (అక్టోబర్ 09న) రోజు రాత్రి తుదిశ్వాస విడిచారు. సోమవారం (అక్టోబర్ 07న) రోజున వయోభారానికి సంబంధించిన పలు అనారోగ్య సమస్యల కారణంగా.. ఆస్పత్రిలో చేరిన రతన్ టాటా ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుండటంతో.. ఆయనను ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచి చికిత్స అందించారు. అయినప్పటికీ ఆయన […]
Ratan Tata : ప్రముఖ వ్యాపారవేత్త, టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా (86) వయోభారంతో కన్నుమూసారు. కొద్ది రోజులుగా ఆయన ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే బుధవారం (అక్టోబర్ 09న) రోజు రాత్రి తుదిశ్వాస విడిచారు. సోమవారం (అక్టోబర్ 07న) రోజున వయోభారానికి సంబంధించిన పలు అనారోగ్య సమస్యల కారణంగా.. ఆస్పత్రిలో చేరిన రతన్ టాటా ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుండటంతో.. ఆయనను ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచి చికిత్స అందించారు. అయినప్పటికీ ఆయన పరిస్థితి పూర్తిగా విషమించటంతో చికిత్స పొందుతూనే ప్రాణాలు వదిలారు.ముంబయిలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో రాత్రి 11.30 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు.
Ratan Tata దిగ్గజం కన్నుమూత..
దిగ్గజ వ్యాపారవేత్త మరణ వార్త విని దేశంలోని అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు మొదలుకొని సామాన్యుల వరకూ అందరూ తమ సంతాపాలను తెలియజేస్తున్నారు. ఇక రతన్ టాటా జీవిత విశేషాల విషయానికి వస్తే ఆయన నికర ఆస్తి విలువ ఎంతనేది ఆసక్తికరంగా మారింది. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022 ప్రకారం రతన్ టాటా నికర ఆస్తి విలువ రూ.3,800 కోట్లుగా ఉంది. 2022లో ఆయన ప్రపంచ సంపన్నుల జాబితాలో 421వ స్థానంలో నిలిచారు. అయితే రతన్ టాటా సంపదను కూడబెట్టుకోవడానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. అత్యంత విలువలను పాటిస్తూ భారతీయుల జీవితాలను మెరుగుపరచాలని నిత్యం ఆలోచించారు. ఆ దిశగానే నిర్ణయాలు తీసుకున్నారు.
సామాజిక విలువలకు కట్టుబడి జీవితాంతం పనిచేశారు. జీవితంలో పెళ్లి కూడా చేసుకోకుండా ఉన్నారు. టాటా గ్రూపుకు నాయకత్వం వహించిన తీరు ఆయనను దేశ పారిశ్రామికవేత్తలలో ఆదర్శవంత వ్యక్తిగా నిలిపింది. దాతృత్వానికి రతన్ టాటా ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. భారత్‌లో సంభవించిన ఎన్నో విపత్తుల సమయాల్లో భారీ విరాళాలను ప్రకటించారు. 1996లో టెలి కమ్యూనికేషన్స్ కంపెనీ అయిన టాటా టెలిసర్వీసెస్‌ను, 2004లో ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ని ప్రారంభించి.. పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక అడుగులు వేశారు. టాటా గ్రూప్ సంస్థను ఉన్నత శిఖరాలకు చేర్చడంలో రతన్ టాటా కీలక పాత్ర పోషించారు. రతన్ టాటా నాయకత్వంలో, టాటా గ్రూప్స్ సంస్థ.. 100 బిలియన్ డాలర్ల విలువైన ప్రపంచ వ్యాపార సామ్రాజ్యంగా ఎదిగింది. తన వ్యాపారాలన్నింటినీ ఎంతో విజయవంతంగా నడిపిస్తూ.. దేశంలోని గొప్ప పారిశ్రామిక వేత్తల్లో ఒకరిగా రతన్ టాటా పేరు సంపాదించుకున్నారు.86 ఏళ్లు ఉన్న రతన్ టాటా.. చివరి దశలో గౌరవ ఛైర్మన్ హోదాలో కొనసాగారు. బిజినెస్ టైకూన్‌గా పేరు తెచ్చుకున్న రతన్ టాటాను.. 2008లో దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మ విభూషణ్‌తో అప్పటి కేంద్ర ప్రభుత్వం సత్కరించింది.