Poco M6 Plus : రూ.10 వేల ధరలో పోకో M6 Plus స్మార్ట్‌ఫోన్
ప్రధానాంశాలు:
పోకో నుండి వచ్చిన సరికొత్త మోడల్స్ .. వాటి ధరలు ఇవే !!
Poco M6 Plus : రూ.10 వేల ధరలో పోకో M6 Plus స్మార్ట్‌ఫోన్
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఇటీవలే పోకో F7 5G స్మార్ట్‌ఫోన్‌ను రూ.30 వేల ధర రేంజ్‌లో లాంచ్ చేశారు. అదే సమయంలో బడ్జెట్ ధరలో ఇప్పటికే ఉన్న పోకో M6 ప్లస్ 5G మోడల్‌కి మార్కెట్లో మంచి ఆదరణ కొనసాగుతోంది. గత సంవత్సరం ఆగస్టులో విడుదలైన ఈ ఫోన్, ఇంకా డిమాండ్‌లో ఉండటం విశేషం. 10 వేల ధరలో 108MP కెమెరా, ఆకట్టుకునే డిజైన్, శక్తివంతమైన ప్రాసెసర్ వంటి ప్రత్యేకతలు దీనిని బెస్ట్ బడ్జెట్ ఫోన్‌గా నిలిపాయి.

Poco M6 Plus : రూ.10 వేల ధరలో పోకో M6 Plus స్మార్ట్‌ఫోన్
Poco M6 Plus : పోకో నుండి సరికొత్త మోడల్స్ .. అదికూడా బడ్జెట్ ధరల్లోని
పోకో M6 ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ ధరకు లభిస్తోంది. 6GB RAM + 128GB స్టోరేజీ వేరియంట్ రూ.13,499 కి విడుదల కాగా, ప్రస్తుతం రూ.10,080కి లభిస్తోంది. అలాగే 8GB RAM + 128GB వేరియంట్ రూ.14,499గా ఉండగా, ప్రస్తుతం రూ.11,499కే కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా 5% క్యాష్‌బ్యాక్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ గ్రాఫైట్ బ్లాక్, ఐస్ సిల్వర్, మిస్టీ లావెండర్ రంగుల్లో లభిస్తోంది. ఇందులో 6.79 అంగుళాల FHD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్‌రేట్, 550 నిట్స్ బ్రైట్‌నెస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఇక పోకో తాజా మోడల్ అయిన పోకో F7 5G కూడా ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. 6.83 అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్, 90W ఫాస్ట్ ఛార్జింగ్, 7550mAh బ్యాటరీ, Android 15 ఆధారిత HyperOS 2.0తో వస్తోంది. ఫోన్‌లో 50MP సోనీ కెమెరా, 8MP అల్ట్రావైడ్, 20MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. 12GB RAM + 256GB స్టోరేజీ వేరియంట్ రూ.31,999కి, 512GB వేరియంట్ రూ.33,999కి లభిస్తోంది. IP66, IP68, IP69 రేటింగ్ లభించిన ఈ ఫోన్ నీటిపోటు, దుమ్ము నిరోధకతతో, 3D IceLoop కూలింగ్ సిస్టమ్‌తో లభిస్తోంది. పోకో బడ్జెట్‌కి తగ్గ బెస్ట్ ఫోన్లను అందిస్తూ యూజర్లను మరింతగా పెంచుకుంటోంది.